ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలసదారులకు Saudi Arabia తీపి కబురు!

ABN, First Publish Date - 2022-01-22T18:30:45+05:30

వలసదారులకు సౌదీ అరేబియా తీపి కబురు చెప్పింది. ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్(ఇఖామా), రీఎంట్రీ, విజిట్ వీసాల గడువును పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: వలసదారులకు సౌదీ అరేబియా తీపి కబురు చెప్పింది. ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్(ఇఖామా), రీఎంట్రీ, విజిట్ వీసాల గడువును పొడిగించింది. జనవరి 31తో ముగుస్తున్న గడువును మరో 10 రోజులు పొడిగిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక ఈ పొడిగింపును ఆటోమెటిక్‌గా వర్తింపజేయనున్నట్లు జవాజత్(జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్) వెల్లడించింది. దీనికోసం వలసదారులు జవాజత్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన దేశాల నుండి వచ్చే సందర్శకులకు ఇది వర్తిస్తుందని జవాజత్ పేర్కొంది.


ప్రయాణ నిషేధం ఎదుర్కొంటున్న దేశాల నుంచి వారు ప్రస్తుతం దేశానికి వెలుపల ఉన్నట్లయితే వారి విజిట్ వీసాల చెల్లుబాటును విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆటోమెటిక్‌గా జనవరి 31 తర్వాత మరో 10 రోజులకు పొడిగిస్తుందని జవాజత్ తెలిపింది. ఇక ఎగ్జిట్, రీఎంట్రీ వీసా వ్యవధి 60, 90, 120 రోజులలో పేర్కొన్నట్లయితే జారీ చేసిన తేదీ నుంచి ప్రయాణానికి మూడు నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. కాగా, సౌదీ అరేబియా నుంచి స్వదేశాలకు వెళ్లే ముందు ఆ దేశంలో రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రవాసులకు ఈ పొడిగింపు నుంచి మినహాయింపు ఇచ్చింది.         

Updated Date - 2022-01-22T18:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising