ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Russian క్షిపణి దాడి: ఉక్రెయిన్‌లో 23 మంది మృతి, 100మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-07-15T17:14:35+05:30

రష్యా సైన్యం జరిపిన క్షిపణి దాడిలో ఉక్రెయిన్‌ దేశంలో 23 మంది మరణించగా, మరో 100 మందికి పైగా గాయపడ్డారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైవ్ (ఉక్రెయిన్):రష్యా సైన్యం జరిపిన క్షిపణి దాడిలో ఉక్రెయిన్‌ దేశంలో 23 మంది మరణించగా, మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే గుర్తించామని, ఇంకా 39 మంది గల్లంతయ్యారని ఉక్రెయిన్ జాతీయ పోలీసు చీఫ్ ఇహోర్ క్లైమెంకో తెలిపారు. రష్యా క్షిపణులు గురువారం సెంట్రల్ ఉక్రెయిన్‌లోని ఒక నగరంపై దాడి చేశాయి. తమ దేశంలోని పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని రష్యా సేనలు దాడి చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆరోపించారు. రాజధాని కైవ్‌కు నైరుతి దిశలో 268 కిలోమీటర్ల దూరంలో ఉన్న విన్నిట్సియాలోని పౌర భవనాలపై నల్ల సముద్రంలో రష్యా జలాంతర్గామి నుంచి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులు పేల్చినట్లు అధికారులు తెలిపారు.


ప్రయోగించిన నాలుగు రష్యన్ క్షిపణుల్లో రెండింటిని ఉక్రేనియన్ వైమానిక రక్షణ దళాలు కూల్చివేసినట్లు విన్నిట్సియా ప్రాంత గవర్నర్ సెర్హి బోర్జోవ్ తెలిపారు.ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే గుర్తించామని, మరో 39 మంది గల్లంతయ్యారని జాతీయ పోలీసు చీఫ్ ఇహోర్ క్లైమెంకో తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.ఆసుపత్రిలో చేరిన 65 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, 34 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది.క్షిపణులు భవనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని, ఇది పార్కింగ్ స్థలంలో ఉన్న 50 కార్లకు వ్యాపించిందని అధికారులు తెలిపారు.


రష్యా ఉద్ధేశపూర్వకంగా తమ దేశ పౌరులపై క్షిపణులను గురిపెట్టిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. కైవ్‌లోని యూఎస్ ఎంబసీ గురువారం అర్థరాత్రి భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న యుఎస్ పౌరులందరూ వెంటనే బయలుదేరాలని యూఎస్ రాయబార కార్యాలయం కోరింది.




Updated Date - 2022-07-15T17:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising