ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

R.S Praveen Kumar: బీఎస్పీ సమగ్ర ప్రవాసీ విధానాన్ని ఆవిష్కరిస్తాం

ABN, First Publish Date - 2022-08-13T13:51:16+05:30

ప్రజా సొమ్ము దోచుకోని బుర్జ్ ఖలీఫాలో దాచుకోనె పాలకులకు దుబాయి(Dubai)లోని తెలంగాణ బిడ్డల బాధలు కనిపించడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు(BSP State President) డాక్టర్ ఆర్.యస్. ప్రవీణ్ కుమార్(R.S Praveen Kumar) విమర్శిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రజా సొమ్ము దోచుకోని బుర్జ్ ఖలీఫాలో దాచుకోనె పాలకులకు దుబాయి(Dubai)లోని తెలంగాణ బిడ్డల బాధలు కనిపించడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు(BSP State President) డాక్టర్ ఆర్.యస్. ప్రవీణ్ కుమార్(R.S Praveen Kumar) విమర్శించారు. పాలకుల వైఫల్యం కారణంగా స్వరాష్ట్రంలో సరైన ఉపాధి లేకపోవడంతో ఎడారి దేశాలకు వలసల పరంపర ఇంకా కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంపన్నులతో బతుకమ్మ జాతరలు నిర్వహించే పాలక వర్గాలు సబ్బండ వర్గాల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. దుబాయి నడిబొడ్డున అరకొర వసతులతో తెలంగాణ ప్రవాసీ కార్మికులు నివసిస్తున్న ప్రాంతాలను శుక్రవారం నాడు ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ కార్మికులు ఆయనకు అడుగడుగునా నీరాజనం పలికారు. పేద కార్మికుల సమస్యలను ప్రవీణ్ కుమార్ ఓపికగా విన్నారు. ప్రవాసులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఆయనకు.. తెలంగాణ బహుజన ప్రవాసీయులు తమ సమస్యలను ఏకరురువు పెట్టారు. 


స్వదేశంలో ఉపాధి లేమి కారణంగా కన్న వారికి, కట్టుకున్న వారికి దూరంగా ఎడారి దేశాలలో భద్రత, వసతులు లేని చోట్ల తెలంగాణ కార్మికులు నివసిస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పాస్ పోర్టులు(PassPorts) కోల్పోయి కొందరు.. గడువు ముగిసి మరికొందరు ప్రవాసలు(NRI) ఇబ్బంది పడుతున్నారన్నారు. ఏ రకమైన సహాయం అందక దయనీయ పరిస్ధితులలో ప్రవాసులు ఉన్నారని పెర్కొన్నారు. భారతీయ ఎంబసీ తగిన విధంగా కార్మికులకు సహాయం చేయడం లేదని ఆయన అరోపించారు. ‘మీ ఓట్లతో గెలిచిన వాళ్లు రాజప్రసాదాలలో హాయిగా విలాసవంత జీవితం గడుపుతున్నారు. కానీ మీరు మాత్రం ఇరుకయిన మంచాలకు పరిమితమయ్యారు’ అని ప్రవాసులతో అన్నారు. వాటికి పెద్ద మొత్తంలో అద్దె చెల్లించటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం సంపన్నులకు మాత్రమే మేలు చేస్తుందని ఆరోపించారు. బహుజనుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ​ఆదివారం దుబాయిలో నిర్వహించే గ్లోబర్ బహుజన కన్వెన్షన్‌లో గల్ఫ్ ప్రవాసీయులకు సంబంధించి బీఎస్పీ సమగ్ర ప్రవాసీ విధానాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు.


Updated Date - 2022-08-13T13:51:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising