ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి ప్రవాసాంధ్రులు రూ.10కోట్ల విరాళం

ABN, First Publish Date - 2022-07-24T18:52:17+05:30

అమెరికాలో నివాసం ఉంటున్న ఇరువురు ప్రవాసాంద్రులు కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి 10 కోట్లు విరాళంగా అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(న్యూయార్క్ నుండి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ): అమెరికాలో నివాసం ఉంటున్న ఇరువురు ప్రవాసాంద్రులు కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి 10 కోట్లు విరాళంగా అందించారు. ఈ నిధులతో పునర్నిర్మాణ పనులు గత సంవత్సర కాలం నుండి శరవేగంగా జరుగుతున్నాయి. బోస్టన్‌లో నివాసం ఉంటున్న ఐకా రవి,  టాంపాలో నివాసం ఉండే నాట్స్ బోర్డ్ మాజీ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ ఈ పది కోట్ల విరాళాన్ని కాణిపాకం ఆలయ నిర్వాహకులకు అందించారు. ఈ నిధులతో ఆలయ పునర్నిర్మాణం దాదాపుగా పూర్తి అయ్యింది.


ఆగస్టు 15వ తేదీ నుండి ఉత్సవాలు

గుత్తికొండ శ్రీనివాస్ ఐకా రవిలు అందించిన విరాళంతో నూతనంగా పునర్నిర్మించిన ఆలయ భవనాలకు 21వ తేదీన ప్రారంభ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. దీని కోసం ఆగస్టు 15వ తేదీ నుండి మహాకుంభాభిషేకం, ఇతర పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు అవసరమైన నిధులను కూడా ప్రవాసాంధ్రులు గుత్తికొండ శ్రీనివాస్, ఐకా రవిలు విరాళంగా అందిస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు అమెరికా నుండి పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు తరలివస్తున్నారు.









Updated Date - 2022-07-24T18:52:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising