ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rishi sunak: అందుకు తగిన వ్యక్తిని నేనే.. రిషి సునాక్ వ్యాఖ్య

ABN, First Publish Date - 2022-08-07T02:18:28+05:30

బ్రిటన్ ప్రజల మనసు గెలిచి ప్రధాని పదవి చేపట్టేందుకు తనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: బ్రిటన్ ప్రజల మనసు గెలిచి ప్రధాని పదవి చేపట్టేందుకు తనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్ (Rishi sunak) తెలిపారు. ఇటీవల జరిగిన సర్వేల్లో ఇదే విషయం వెల్లడైందని ఆయన తెలిపారు. ప్రజల మద్దతు తనకు లభిస్తోందని, ప్రచారంలో తాను చెప్పే విషయాలపై వారు సానుకూలంగా స్పందిస్తున్నారని బీబీసీ చానల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని పదవికి ఎవరు అర్హులనే విషయంలో ప్రజలు ఇంకా ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేదని చెప్పారు. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా ఇలాంటి వారే తారసపడుతున్నారు. నేను చెప్పే విషయాలపై వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఎలా పరుగులు పెట్టించాలి, దేశాన్ని ఏ విధంగా ఏకీకృతం చేయాలి, వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకం ఎలా పెంచాలి.. అనే విషయాల్లో నాతో వారు ఏకీభవిస్తున్నారు.’’ అని రిషి అన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తానే తగిన వ్యక్తినని ఆయన తేల్చి చెప్పారు. 


‘‘తదుపరి ఎన్నికల్లో లేబర్ పార్టీని ఎలా ఓడించాలనే విషయంపై ప్రస్తుతం పార్టీ సభ్యులు దృష్టి పెట్టారు. ఈ పని చక్కబెట్టేందుకు నేనే తగిన వ్యక్తిని. అంతేకాకుండా.. బ్రిటన్ ఎదుర్కొంటున్న సమస్యలను ఓ ప్రధానిగా  పరిష్కరించేందుకు తగిన వాడిని’’ అని చెప్పారు. ‘‘కరోనా సంక్షోభ సమయంలో నేనెలా పనిచేసిందీ ప్రజలు చూశారు. ఇక ప్రధానిగా కూడా అదే స్థాయిలో సమస్యల సత్వర పరిష్కారానికి పని చేస్తాను’’ అని రిషి స్పష్టం చేశారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు త్వరలో దేశ నూతన ప్రధానిని ఎన్నుకోనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక పార్టీ సభ్యులు మాత్రం రిషి ప్రధాన ప్రత్యర్థి లిజ్ ట్రస్(Lizz truss) వైపే ఉన్నట్టు ఇటీవల జరిగిన పలు సర్వేల్లో వెల్లడైంది. దీనిపై స్పందించిన రిషి.. పోటీ తొలినాళ్లల్లో తానే ముందువరుసలో ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. లిజ్‌కు గట్టి పోటీ ఇస్తానని, ప్రతి ఒక్క ఓటు కోసం పోరాడతానని చెప్పారు.

Updated Date - 2022-08-07T02:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising