ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటిష్‌ ప్రధానిగా రిషి సనక్‌కు అవకాశాలు!

ABN, First Publish Date - 2022-01-14T12:53:48+05:30

బ్రిటిష్‌ ప్రధాని పీఠంపై భారత సంతతికి చెందిన వ్యక్తి అధిరోహించే అవకాశాలు మెరుగవుతున్నాయి. బ్రిటిష్‌ చాన్సలర్‌, రిచ్‌మండ్‌ ఎంపీ రిషి సనక్‌కు ఆ అవకాశం దక్కే అవకాశాలున్నాయి. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో మందు పార్టీ ఇచ్చి తీవ్ర విమర్శల పాలైన విషయం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌: బ్రిటిష్‌ ప్రధాని పీఠంపై భారత సంతతికి చెందిన వ్యక్తి అధిరోహించే అవకాశాలు మెరుగవుతున్నాయి. బ్రిటిష్‌ చాన్సలర్‌, రిచ్‌మండ్‌ ఎంపీ రిషి సనక్‌కు ఆ అవకాశం దక్కే అవకాశాలున్నాయి. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో మందు పార్టీ ఇచ్చి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. బోరిస్‌ తీరుపై విపక్షం నుంచే కాకుండా.. స్వపక్షంలోనూ విమర్శలు ఉండడంతో, ఈ ఏడాది చివరికల్లా ఆయన గద్దెదిగాల్సిన పరిస్థితులు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. ఆయన స్థానంలో రిషి సనక్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పదవి కోసం విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, కేబినెట్‌ మంత్రి మిచేల్‌ గోవ్‌, విదేశాంగ శాఖ మాజీ మంత్రి జెర్మీహంట్‌, హోంమంత్రి ప్రీతి పటేల్‌, ఆరోగ్య శాఖ మంత్రి, పాక్‌ సంతతికి చెందిన సాజిద్‌ జావెద్‌ పోటీ పడుతున్నా.. రేసులో మాత్రం రిషి ముందంజలో ఉన్నారు. 




Updated Date - 2022-01-14T12:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising