ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెస్టారెంట్‌కు షాకిచ్చిన కోర్టు.. కస్టమర్‌కు రూ.70కోట్లు చెల్లించాల్సిందేనంటూ తీర్పు.. కారణం ఏంటంటే!

ABN, First Publish Date - 2022-01-19T21:32:25+05:30

అమెరికా కోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. కస్టమర్‌కు రూ.70కోట్లు చెల్లించాల్సిందే అని రెస్టారెంట్‌ను ఆదేశించింది. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికా కోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. కస్టమర్‌కు రూ.70కోట్లు చెల్లించాల్సిందే అని రెస్టారెంట్‌ను ఆదేశించింది. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


టెన్నెసీ రాష్ట్రంలోని మేరియన్ కౌంటీకి చెందిన విలియమ్ క్రానన్ అనే వ్యక్తి 2014లో స్థానికంగా ఉన్న క్రాకర్ బారెల్ అనే రెస్టారెంట్‌కు వెళ్లాడు. మెనూ చూసి, తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను అక్కడి సిబ్బంది సర్వ్ చేయగానే తినడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తాగేందుకు మంచి నీటిని తీసుకురావాలని విలియమ్ క్రానన్ సిబ్బందికి సూచించాడు. దీంతో ఓ గ్లాస్‌ తీసుకొచ్చి అతడికి అందించారు. గ్లాస్‌లో ఉన్న నీటిని ఒక సిప్ తీసుకోగానే.. అతడికి నోరు మండిపోయింది. దీంతో అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. అనంతరం తనకు మంచి నీటిని బదులు.. కెమికల్ వాటర్ అందించినట్టు గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా రెస్టారెంట్‌పై కోర్టులో కేసు వేశాడు. తాజాగా ఈ కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. విలియమ్ క్రానన్‌కు 9.4 మిలియన్ డాలర్లను చెల్లించాల్సిందిగా రెస్టారెంట్‌ను ఆదేశించింది. ఇదిలా ఉంటే.. భారీ మొత్తంలో విలియమ్‌ క్రానన్‌కు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. స్థానిక చట్టాల ప్రకారం అతడు అంత డబ్బును పొందలేడని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 




Updated Date - 2022-01-19T21:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising