ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Britain pm elections: రిషి సునాక్ ఓటమికి భారతీయ మూలాలే కారణమా..?

ABN, First Publish Date - 2022-09-05T23:30:42+05:30

లండన్ రాజకీయ వర్గాల్ల అభిప్రాయం ప్రకారం రిషి అపజయానికి కొన్ని ముఖ్య కారణాలు ఏంటంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అందరి అంచనాలను నిజం చేస్తూ బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్(Lizz Truss) ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ(Conservative party) సభ్యులు లిజ్‌కే పట్టం కట్టడంతో ఆమె రిషిపై 21 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రిషి సునాక్‌ను(Rishi Sunak) ప్రధానిగా చూడాలనుకున్న వారికి నిరాశే మిగిలింది.  పార్టీ సభ్యులు తొలుత రిషికే మద్దతు తెలిపినా.. లిజ్ ట్రస్ క్రమక్రమంగా రిషిపై పైచేయి సాధించారు. పార్టీ సభ్యుల్లో అనేక మంది లిజ్‌వైపే మళ్లడంతో చివరకు విజయం ఆమెనే వరించింది. లండన్ రాజకీయ వర్గాల అభిప్రాయం ప్రకారం రిషి అపజయానికి కొన్ని ముఖ్య కారణాలు ఏంటంటే.. 


1. సునాక్ భార్య అక్షతామూర్తి(Akshata Murthy) బ్రిటన్‌లో పన్ను ఎగ్గొట్టారన్న వాదన ఆయన విజయావకాశాలకు బాగా గండికొట్టిందని పరిశీలకులు చెబుతున్నారు. బ్రిటన్‌లో తనకు స్థానికత హోదా(Domicile status) లేదన్న కారణంగా అక్షతామూర్తి పన్నులు చెల్లించలేదు. ఆ తరువాత.. రిషి బృందం పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినా అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. 


2.అమెరికా నుంచి బ్రిటన్‌కు తిరిగొచ్చాక కూడా రిషి దంపతులు తమ గ్రీన్ కార్డులను వదులుకోలేదన్న అంశం కూడా రిషికి ప్రతిబంధకంగా మారింది. ఫలితంగా.. అనేక మంది రిషి దీర్ఘకాలిక వ్యూహాలపై సందేహాలు వ్యక్తం చేశారు. ద్వంద్వ పౌరసత్వాన్ని బ్రిటన్ అనుమతిస్తున్నా రిషిపై వ్యతిరేకత వ్యక్తం కావడం గమనార్హం. 


3. ఇక ప్రజలపై పన్నుల భారం తగ్గించేందుకు రిషి ససేమిరా అనడం కూడా పార్టీ సభ్యులను ఆయనకు దూరం చేసింది. 


4. రిషి వెన్నుపోటు కారణంగానే బోరిస్ జాన్సన్(Boris Johnson) ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని పార్టీ సభ్యుల్లో ఓ వాదన ఉంది. బోరిస్ కేబినెట్ నుంచి మొదటగా రిషి బయటకొచ్చారు. ఈ భావన కూడా రిషి విజయావకాశాలపై దెబ్బకొట్టిందన్న అంచనా అక్కడి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇక బోరిస్ జాన్సన్ కూడా రిషికి వ్యతిరేకంగా తెరవెనుక ప్రచారం నిర్వహించి ఆయన ఓటమికి కారణమయ్యారన్న వాదన కూడా ఉంది.   


5. భారతీయ మూలాలున్న రిషి శ్వేతజాతీయేతరుడు కావడం కూడా ఓ కారణమని కొందరు విశ్లేషించినా రిషి మాత్రం మొదట్లోనే ఈ వాదనను తోసిపుచ్చారు. పార్టీ సభ్యులు తనకు అన్ని విధాలా మద్దతుగా నిలవడంతోనే తనకు బోరిస్ మంత్రివర్గంలో స్థానం లభించిందని గుర్తు చేశారు. అయితే.. బ్రిటన్ ఎన్నికలపై వివిధ సర్వేల ఫలితాలను విశ్లేషించిన గణాంక శాస్త్రవేత్తలు మాత్రం..బ్రిటన్ ఎన్నికల్లో జాత్యాహంకార పాత్ర ఎంతనేది కచ్చితంగా నిర్ధారించలేమని చెబుతున్నారు. 

                                                                                                       - చంద్రశేఖర్‌ పెనమకూరి

                                                                                                      

Updated Date - 2022-09-05T23:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising