ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి వార్తల్లో నిలిచిన Sonu Sood.. ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం.. ఈసారి ఈ రియల్ హీరో ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-06-16T12:43:21+05:30

సినిమాల్లో ఆయన విలనే.. కానీ నిజ జీవితంలో మాత్రం హీరో. కొవిడ్ సమయంలో ఎంతో మంది నిరుపేదలకు ఆపన్నహస్తం అందించిన సోనూసూద్.. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. దేశం కాని దేశంలో చిక్కుకున్న భారతీయుడిని తిరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: సినిమాల్లో ఆయన విలనే.. కానీ నిజ జీవితంలో మాత్రం హీరో. కొవిడ్ సమయంలో ఎంతో మంది నిరుపేదలకు ఆపన్నహస్తం అందించిన సోనూసూద్.. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. దేశం కాని దేశంలో చిక్కుకున్న భారతీయుడిని తిరిగి ఇండియా చేరుకునేలా చేశారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


భారత్‌కు చెందిన సాహిల్ ఖాన్ అనే వ్యక్తి ఓ పని మీద కొద్ది రోజుల క్రితం విదేశాలకు వెళ్లాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ.. అతడు థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయాడు. ఇండియాకు తిరిగి వచ్చే పరిస్థితులు లేని నిస్సహాయ స్థితిలో.. తన పరిస్థితి వివరిస్తూ ట్విట్టర్ ద్వారా సోనూసూద్‌ను సాయం కోరాడు. సాహిల్ ట్వీట్‌కు గంటల వ్యవధిలోనే సోనూసూద్ స్పందించారు. విమానం టికెట్ కొనుగోలు చేసి.. అతడికి పంపించారు.



దీంతో సాహిల్ తిరిగి ఇండియాకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘ఎట్టకేలకు ఇండియాకు చేరుకున్నాను. ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు. మీరు మరింత సక్కెస్ సాధించాలని ఎప్పుడూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఇటువంటి సహాయం ఈ రోజుల్లో ఎవరూ చేయలేరు’ అని వీడియోలో పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. సోనూసూద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 




Updated Date - 2022-06-16T12:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising