ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shaktikanta Das: ఎన్నారైలకు ఆర్‌బీఐ తీపి కబురు.. స్వదేశంలో ఉన్న తల్లిదండ్రుల సమస్యలను ఇక చిటికెలో..

ABN, First Publish Date - 2022-08-06T00:59:00+05:30

ఎన్నారై(NRI)లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. విదేశాల్లో నివసిస్తూనే.. స్వదేశంలో ఉన్న తల్లిదండ్రుల ఇబ్బందులను తీర్చేందుకు మార్గం సుగమం చేస్తున్నట్టు ప్రకటించింది. ఉద్యోగం రీత్యా విదేశాల్లో నివసిస్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఎన్నారై(NRI)లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. విదేశాల్లో నివసిస్తూనే.. స్వదేశంలో ఉన్న తల్లిదండ్రుల ఇబ్బందులను తీర్చేందుకు మార్గం సుగమం చేస్తున్నట్టు ప్రకటించింది. ఉద్యోగం రీత్యా విదేశాల్లో నివసిస్తున్న పిల్లలు.. ఇండియాలో నివసిస్తున్న తల్లిదండ్రుల(Parents)కు సంబంధించిన కరెంట్ బిల్లు(Power bill), వాటర్ బిల్లు(Water bill) తదితర బిల్లులను అక్కడి నుంచే చెల్లించే విధంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌లో మార్పులు చేస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్(RBI Governor) శక్తికాంత దాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో ఎన్నారైలకు ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. 



ఇప్పటి వరకు పిల్లలను విదేశాలకు పంపిన వృద్ధులు.. బిల్లులు చెల్లించడానికి ఇతర వ్యక్తులపై ఆధారపడే వారు. శక్తికాంత దాస్ చెప్పినట్టుగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌(Bharat Bill Payment System)లో మార్పులు చేసి, విదేశాల నుంచి ఎన్నారైలు బిల్లులు చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వస్తే వాళ్ల తల్లిదండ్రుల సమస్యలు చాలా వరకు తీరుతాయి. ఇప్పటి వరకు ఈ పేమెంట్ సిస్టమ్.. భారత్‌లో మాత్రమే పని చేసేది. కానీ విదేశాల నుంచి కూడా వినియోగించే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్టు శక్తికాంత దాస్ చెప్పారు.


Updated Date - 2022-08-06T00:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising