ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America: రమేష్ బల్వానీకి షాకిచ్చిన కోర్టు.. 13ఏళ్ల జైలు శిక్ష!

ABN, First Publish Date - 2022-12-08T20:47:30+05:30

ప్రియురాలితో కలిసి భారీ మోసానికి పాల్పడిన రమేష్ సన్నీ బల్వానీకి కోర్టు షాకిచ్చింది. దాదాపు 13ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించింది. రమేష్ సన్నీ బల్వానీకి అమెరికా కోర్టు జైలు శిక్ష విధించడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ప్రియురాలితో కలిసి భారీ మోసానికి పాల్పడిన రమేష్ సన్నీ బల్వానీకి కోర్టు షాకిచ్చింది. దాదాపు 13ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించింది. రమేష్ సన్నీ బల్వానీకి అమెరికా కోర్టు జైలు శిక్ష విధించడంతో.. ఎలిజబెత్ హోమ్స్ ఉదంతం మరోసారి అగ్రరాజ్యంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఎలిజబెత్ హోమ్స్ ఎవరు? రమేష్ సన్నీ బల్వానీ చేసిన నేరం ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎలిజబెత్ హోమ్స్ ప్రస్తుత వయసు 38ఏళ్లు. 19ఏళ్ల వయసులో ఈమె.. డయాగ్నోస్టిక్స్ ఫీల్డ్‌లో విప్లవం వచ్చే విధంగా సంచలన ప్రకటన చేసింది. థెరానోస్ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించిన ఎలిజబెత్.. కేవలం ఒకే ఒక్క రక్తం చుక్కతో బ్లడ్ టెస్ట్ నిర్వహించుకునేందుకు వీలుగా సెల్ఫ్ సర్వీస్ మెషిన్లను రూపొందించినట్టు ప్రకటించింది. భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించింది. అమెరికాలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు కూడా ఇందుకోసం ఆసక్తి చూపారు.

అయితే.. 2015లో థెరానోస్ అందించే సెల్ఫ్ సర్వీస్ మెషిన్ల పని తనంపై ఓ ప్రముఖ మీడియా వరుస కథనాలను వెలువరించింది. థెరానోస్ అందించే ఆ మెషన్లు సరిగా పని చేయడం లేదని, తప్పుడు ఫలితాలు చూపుతున్నాయని మీడియా తన కథనాల్లో స్పష్టం చేసింది. దీంతో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే ఎలిజబెత్ హోమ్స్ బండారం బట్టబయలైంది. అయితే.. థెరానోస్ వ్యవహారాలను చూసూ.. ఎలిజబెత్‌తో కొన్ని రోజులపాటు డేటింగ్ చేసిన రమేష్ సన్నీ బల్వానీ ఆ తర్వాత దూరమయ్యాడు. కానీ అతడి పాత్రపై కూడా దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి. పెట్టుబడిదారులను మోసం చేయడంలో రమేష్ సన్నీ బల్వానీ పాత్ర కూడా ఉందనే ఆధారాలు లభించడంతో పోలీసులు అతడిని మార్చిలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ క్రమంలో ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతడిని దోషిగా తేల్చింది.

Updated Date - 2022-12-08T20:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising