ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6 ఏళ్లుగా సౌదీలోనే.. ఒక్కసారి కూడా ఇంటికి రాని వైనం! ఇంతలో అనూహ్యంగా కబళించిన మృత్యువు! కంటతడి పెట్టిస్తున్న కార్మికుడి గాధ..!

ABN, First Publish Date - 2022-04-10T00:11:48+05:30

6 ఏళ్లుగా సౌదీలోనే.. ఒక్కసారి కూడా ఇంటికి రాని వైనం! ఇంతలో అనూహ్యంగా కబళించిన మృత్యువు! కంటతడి పెట్టిస్తున్న కార్మికుడి గాధ..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆరేళ్లుగా ప్రవాసంలోనే ఉంటున్నాడా వ్యక్తి. భారత్‌లోని కుటుంబంతో ఫోన్లో సంభాషించడం మినహా స్వదేశానికి ఒక్కసారి కూడా రాలేదు. రెక్కల కష్టంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.  కొంత కాలం క్రితం మూడు లక్షల రూపాయలు కావాలంటూ ఇంట్లో వాళ్లని కోరాడు. అతడి కోరిక మేరకు ఆ మొత్తాన్ని వారు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తరువాత.. అతడి నుంచి ఫోన్లు రావడం ఆగిపోయింది. చివరికి ఓరోజు అతడు చనిపోయినట్టు కబురు రావడంతో కుటుంబసభ్యులు విచారంలో మునిగిపోయారు. రాజస్థాన్‌లోని శీకర్‌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 


దాయిరా గ్రామానికి చెందిన కైలాస్ శైనీ(35) సుమారు ఆరేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ కార్మికుడిగా పని చేసుకుంటూ రెక్కల కష్టంతో తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిత్యం అతడు తన కుటుంబంతో ఫోన్లో సంభాషించేవాడే కానీ.. ఈ ఆరేళ్లలో ఒక్కసారి కూడా భారత్‌కు రాలేదు. కొంత కాలం క్రితం మూడు లక్షల రూపాయలు కావాలంటూ తన కుటుంబ సభ్యులను కోరాడు. అతడు కోరినట్టే వారు ఆ డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆ తరువాత.. అనూహ్యంగా అతడు ఇంటికి ఫోన్ చేయడం మానేశాడు. దీంతో.. అతడి కుటుంబసభ్యులు భయాందోళనలకు లోనయ్యారు. తమ పరిచయస్తుల ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు  ప్రయత్నించారు. 


ఇంతలో ఓ రోజు కైలాస్‌ మరణించాడంటూ అతడి స్నేహితుడు కైలాస్ సోదరుడికి సమాచారం అందించాడు. దీంతో.. యావత్ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక.. అతడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఆ కుటుంబం చాలా ప్రయాసపడింది. చివరికి అతడు మరణించిన 45 రోజుల తరువాత కైలాస్‌ మృతదేహం ఇటీవలే స్వగ్రామానికి చేరుకుంది. ఆరేళ్ల క్రితం తాము చివరిసారిగా చూసిన వ్యక్తి.. ఇలా నిర్జీవంగా కళ్లముందు కనిపించడంతో ఆ కుటుంబం బోరున విలపించింది.  కైలాస్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2022-04-10T00:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising