ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raja Krishnamoorthi: ఇల్లినాయిస్ నుంచి ఘన విజయం

ABN, First Publish Date - 2022-06-30T16:48:13+05:30

ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి (Raja Krishnamoorthi) ఇల్లినాయిస్ నుండి డెమొక్రాటిక్ ప్రైమరీ (Democratic Primary)లో ఘన విజయం సాధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి (Raja Krishnamoorthi) ఇల్లినాయిస్ నుండి డెమొక్రాటిక్ ప్రైమరీ (Democratic Primary)లో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి జునైద్ అహ్మద్‌ను (Junaid Ahmed) 71 శాతం ఓట్లతో ఓడించారు. ఇల్లినాయిస్‌లోని ఎనిమిదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో బాగా ఆదరణ ఉన్న కృష్ణమూర్తి జునైద్ అహ్మద్‌ నిర్వహించిన మతపరమైన ప్రచారాన్ని కూడా అధిగమించి భారీ మెజారిటీ సాధించడం విశేషం. "ఇల్లినాయిస్‌లోని ఎనిమిదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లోని డెమొక్రాటిక్ ప్రైమరీ ఓటర్లు కాంగ్రెస్‌కు మళ్లీ నా ఎన్నికల ప్రచారానికి మద్దతుగా అఖండమైన, నిర్ణయాత్మక పద్ధతిలో ఓటు వేసినందుకు ధన్యవాదాలు. ఇది నాకు దక్కిన గౌరవం. కాంగ్రెస్‌లో మధ్యతరగతి కోసం, మహిళల పునరుత్పత్తి హక్కుల కోసం, ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా రాబోయే నెలల్లో కీలక పోరు ఉంటుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తాను" అని కృష్ణమూర్తి అన్నారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా వచ్చే నవంబర్ 8న జరిగే జనరల్ ఎన్నికలపై ఉందన్నారు. ఈ ఎన్నికల్లో రాజా కృష్ణమూర్తి రిపబ్లికన్ అభ్యర్థి అయిన క్రిస్ డార్గిస్‌ను ఢీకొనబోతున్నారు.  


Updated Date - 2022-06-30T16:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising