ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Britain pm elections: రిషి సునాక్ ఆసక్తికర వ్యాఖ్య..

ABN, First Publish Date - 2022-08-01T03:20:51+05:30

బ్రిటన్ ప్రధాన పదవి రేసులో రిషి సునాక్ వెనకపడుతున్నారని ఇటీవల కాలంలో జరిగిన పలు సర్వేలు తేల్చి చెప్పారు. దీంతో..రిషిని ఓటమి దిశగా నడిపిస్తున్న అంశాలేంటనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రిషి సునాక్ కీలక వ్యాఖ్య చేశారు. బ్రిటన్ ఎన్నికలలో జాత్యాహంకారానికి తావేలేదని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్:  బ్రిటన్ ప్రధాని పదవి రేసులో(Britain pm elections) రిషి సునాక్(Rishi sunak) వెనకపడుతున్నారని ఇటీవల కాలంలో జరిగిన పలు సర్వేలు తేల్చి చెప్పాయి. దీంతో..రిషిని ఓటమి దిశగా నడిపిస్తున్న అంశాలేంటనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రిషి సునాక్ కీలక వ్యాఖ్య చేశారు. బ్రిటన్ ఎన్నికలలో జాత్యాహంకారానికి తావేలేదని స్పష్టం చేశారు. అంతకుమును బ్రిటన్‌లోని భారత సంతతి ప్రముఖుడొకరు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు. కన్సర్వేటివ్ పార్టీకి తరచూ విరాళాలిచ్చే భారత సంతతి వ్యాపారవేత్త లార్డ్ రామీ రేంజర్ గత వారం బ్రిటన్ ఎన్నికకు సంబంధించి ఓ కీలక వ్యాఖ్య చేశారు. ఈ ఎన్నికలో సునాక్ ఓడిపోవాల్సి వస్తే మాత్రం బ్రిటన్‌పై జాత్యాహంకారపూరిత దేశంగా ముద్రపడే అవకాశం ఉందని అన్నారు. 


ఇదిలా ఉంటే..  ప్రధాని రేసులో తాను వెనుకపడినట్టు సర్వేలు చెబుతున్న తరుణంలో రిషి జాత్యాహంకారం ప్రస్తావన  తీసుకొచ్చారు. ‘‘ఈ ఎన్నికల్లో జాత్యాహంకారానికి తావే లేదనేది నా గట్టి నమ్మకం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యా. పార్టీ సభ్యులు ప్రతిభకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం బ్రిటన్‌ను నడిపించే సమర్థవంతమైన ప్రధాని ఎవరా అని ఆలోచిస్తున్నారు. ఒక వ్యక్తి స్త్రీనా పురుషుడా.. అతడి మూలాలేమిటి అనే అంశాలతో ఈ ఎన్నికకు ఎటువంటి సంబంధం లేదు’’ అని స్పష్టం చేశారు.

Updated Date - 2022-08-01T03:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising