ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాణికీ తప్పని మహమ్మారి.. !

ABN, First Publish Date - 2022-02-21T00:40:13+05:30

బ్రిటన్ రాణి ఎలిజెబెత్ కరోనా బారిన పడ్డారు. బకింగ్‌హామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. రాణి ఎలిజెబెత్‌కు జలుబు లాంటి లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నట్టు ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ రాణి ఎలిజబెత్(95) కరోనా బారిన పడ్డారు. బకింగ్‌హామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. రాణి ఎలిజబెత్‌కు జలుబు లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నట్టు ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు. కొద్ది వారాల క్రితమే.. రాణి పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రాకుమారుడికి డైరెక్ట్ కాంటాక్ట్‌లోకి వచ్చిన కారణంగానే రాణికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఇక కరోనా చికిత్సకు సంబంధించి ప్రస్తుతమున్న ప్రామాణిక మార్గదర్శకాల ప్రకారం రాణి ఎలిజెబెత్‌కు వైద్యం కొనసాగిస్తున్నారు. అయితే.. బ్రిటన్ రాణి స్వల్ప స్థాయిలో అధికారిక బాధ్యతలు నిర్వహిస్తారని కూడా తమ ప్రకటనలో ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు. కాగా.. అత్యధిక కాలం పాటు( 70 ఏళ్లు) బ్రిటన్ సింహాసనంపై కొనసాగుతున్న పాలకురాలిగా బ్రిటన్ రాణి.. రికార్డు సృష్టించారు. ఆమె రెండు డోసుల కరోనా టీకాతో పాటూ బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు.

Updated Date - 2022-02-21T00:40:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising