ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

QUAD ఫెలోషిప్.. ఇదో విశిష్ట కార్యక్రమన్న ప్రధాని మోదీ!

ABN, First Publish Date - 2022-05-24T23:10:46+05:30

క్వాడ్ సదస్సులో భాగంగా మంగళవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్వాడ్ దేశాల విద్యార్థుల కోసం క్వాడ్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: క్వాడ్ సదస్సులో భాగంగా మంగళవారం క్వాడ్ దేశాల(భారత్‌, అమెరికా, జపాన్, ఆస్ర్టేలియా) అధినేతలు విద్యార్థుల కోసం క్వాడ్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్రాల విద్యార్థులు అమెరికాలో అత్యున్నత చదువులు అభ్యసించేందుకు ఈ ఫెలోషిప్ అవకాశం కల్పిస్తోంది. ప్రతి క్వాడ్ దేశం నుంచి 25 మంది  విద్యార్థులు చొప్పున ఏడాదికి వంద మందిని ఈ ఫెలోషిప్‌కు ఇస్తారు. 


క్వాడ్ ఫెలోషిప్ కార్యక్రమం విశిష్టమైన కార్యక్రమమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా చెప్పారు. గ్రాడ్యుయేట్, డాక్టోరేట్ కార్యక్రమాలలో మన  విద్యార్థులకు గొప్ప అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని కిషిదా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటొనీ పాల్గొన్నారు. ఈ ఫెలోషిప్‌లో భాగంగా విద్యార్థులకు 50 వేల డాలర్ల ఉపకార వేతనం ఏకమొత్తంగా అందుతుంది. ఈ మొత్తాన్ని విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, వసతి తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చు. అయితే.. దీనితో పాటూ ఇతర విద్యాసంబంధిత అవసరాల కోసం క్వాడ్ విద్యార్థులు 25 వేల  డాలర్ల అదనపు స్కాలర్ షిప్స్‌కు కూడా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉంది. 



Updated Date - 2022-05-24T23:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising