ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా కిండర్ గార్డెన్ స్కూల్ పిల్లల నినాదాలు..!

ABN, First Publish Date - 2022-03-22T22:05:50+05:30

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవి నుంచి దిగిపోవాలంటూ కొందరు కిండర్‌గార్టెన్ తరగతి పిల్లలు నినాదాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా:  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవి నుంచి దిగిపోవాలంటూ కొందరు కిండర్‌గార్టెన్ తరగతి పిల్లలు నినాదాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ‘నిరసన’ కార్యక్రమాన్ని ఓ టీచర్ ముందుండి నడిపించినట్టు తెలుస్తోంది. బైడెన్ ఏం చేయాలి అని టీచర్ ప్రశ్నిస్తే.. వెంటనే పదవి నుంచి దిగిపోవాలి.. అని పిల్లలు నినాదాలు చేసినట్టు ఆ వీడియోలో ఉంది. కాలిఫోర్నియాలోని ఓ స్కూల్‌లో ఇటీవల ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 


కాగా.. విషయం వైరల్ అవడంతో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది. అమెరికా అధ్యక్ష స్థానాన్ని గౌరవించడమే తమ విధానమని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఘటనకు బాధ్యురాలైన టీచర్‌పై చర్యలు ఏమైనా తీసుకున్నారా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే.. పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఈ ఘటన పట్ల అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. తమ చిన్నారులను మరో స్కూల్‌లో చేర్పించామని కూడా కొందరు తల్లిదండ్రులు స్థానిక మీడియాకు తెలిపారు. 



Updated Date - 2022-03-22T22:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising