ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపరాష్ట్రపతిని డాలస్‌కు ఆహ్వానించిన ప్రసాద్ తోటకూర

ABN, First Publish Date - 2022-04-23T00:25:01+05:30

అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. మహాత్మా గాంధీ మె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మా గాంధీ  మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ తరఫున ఉపరాష్ట్రపతిని శాలువతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా డాలస్ నగరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయనకు తెలియజేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా ఉపరాష్ట్రపతిని ఆహ్వానించారు. అంతేకాకుండా.. వెంకయ్య నాయుడుతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా భవిష్యత్తు తరానికి భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసేలా సంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కూడా అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు. దీనిపై ఉపరాష్ట్రపతి స్పందించారు. సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. ఇక ముందు కూడా సేవా భావంతో ముందుకు వెళ్లాలని సూచించారు. 




Updated Date - 2022-04-23T00:25:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising