ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు వర్గాలుగా చీలిపోయిన తానా.. కోర్టు తీర్పుతోనైనా వివాదం సద్దుమణిగేనా..?

ABN, First Publish Date - 2022-08-17T20:31:08+05:30

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా).. అటు అమెరికాతోపాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తానాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంస్థగా గుర్తింపు పొందిన తానా.. అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకటరమణ వర్గాలుగా విడిపోయింది. ఈ క్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా).. అటు అమెరికాతోపాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తానాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంస్థగా గుర్తింపు పొందిన తానా.. అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకటరమణ వర్గాలుగా విడిపోయింది. ఈ క్రమంలో అంజయ్య చౌదరి (Lavu Anjaiah Chowdary) ఆధ్వర్యంలో గురువారం రాత్రి తానా ఫౌండేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  యార్లగడ్డ వెంకటరమణ(Yarlagadda Venkata Ramana) ను ఫౌండేషన్ ఛైర్మన్ పదవి నుంచి.. అలాగే పోలవరపు శ్రీకాంత్‌ను కోశాధికారి పదవి నుంచి తొలగిస్తూ తీర్మానం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం తానా ఫౌండేషన్(TANA Foundation) కార్యదర్శిగా ఉన్న శశికాంత్‌ను ఫౌండేషన్ ఛైర్మన్‌గా.. వినయ్ మద్దినేనిని కోశాధికారిగా, విద్యా గారపాటిని కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 15 మంది సభ్యుల్లో అత్యధికులు ఈ నిర్ణయాన్ని సమర్థించారు. 



అయితే తానా ఫౌండేషన్ సమావేశాన్ని బహిష్కరించిన యార్లగడ్డ వర్గం.. తీర్మానాన్ని వ్యతిరేకించింది. అంతేకాకుండా న్యాయపోరాటానికి సైతం సిద్ధమైంది. ఫౌండేషన్ సమావేశం నిర్వహించవద్దని ముందుగానే అటార్నీ ద్వారా నోటీసులు పంపించింది. అయినప్పటికీ లావు అంజయ్య వర్గం సమావేశం నిర్వహించి.. తీర్మానాలు చేయడంతో.. యార్లగడ్డ వర్గం కోర్టును ఆశ్రయించింది. ఇరు వైపు వాదనలు విన్న కోర్టు.. యార్లగడ్డ వర్గానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. యార్లగడ్డ వెంకటరమణ, పోలవరపు శ్రీకాంత్‌ను మునుపటిలాగే ఫౌండేషన్ ఛైర్మన్, కోశాధికారిగా కొనసాగించాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఇదిలా ఉంటే.. తానా సభ్యులు మాత్రం వర్గపోరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలపై కాకుండా కార్యక్రమాలపై దృష్టిసారించాలని తానా నాయకత్వానికి సలహా ఇస్తున్నారు. 


Updated Date - 2022-08-17T20:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising