ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America: అగ్రరాజ్యంలో కొత్త టెన్షన్.. పూర్తిగా అంతరించిపోయిందనుకున్న వైరస్.. దశాబ్దం తర్వాత మళ్లీ వెలుగులోకి

ABN, First Publish Date - 2022-07-24T13:19:11+05:30

అమెరికాలో పూర్తిగా అంతరించిపోయిందనుకున్న పోలియో వైరస్‌, 2013 తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ దేశంలో వెలుగుచూసింది. న్యూయార్క్‌లోని ఓ వ్యక్తిలో పోలియోను గుర్తించినట్లు అమెరికా వైద్యాధికారులు వెల్లడించారు. అతడు పోలియో వ్యాక్సినేషన్‌ చేయించుకోలేదన్నారు. 20వ శతాబ్దం వరకూ తీవ్రస్థాయిలో విస్తరించిన పోలియో మహమ్మారి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలో మళ్లీ పోలియో కేసు

2013 తర్వాత తొలిసారిగా న్యూయార్క్‌లో గుర్తించిన అధికారులు

వర్జీనియా, జూలై 23: అమెరికాలో పూర్తిగా అంతరించిపోయిందనుకున్న పోలియో వైరస్‌, 2013 తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ దేశంలో వెలుగుచూసింది. న్యూయార్క్‌లోని ఓ వ్యక్తిలో పోలియోను గుర్తించినట్లు అమెరికా వైద్యాధికారులు వెల్లడించారు. అతడు పోలియో వ్యాక్సినేషన్‌ చేయించుకోలేదన్నారు. 20వ శతాబ్దం వరకూ తీవ్రస్థాయిలో విస్తరించిన పోలియో మహమ్మారి, తర్వాతి కాలంలో టీకాల రాకతో అంతరించే దశకు చేరింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 13 కేసులు మాత్రమే వెలుగుచూశాయి. నోటి ద్వారా వేసే పోలియో చుక్కల టీకాలో ఉండే బలహీన వైరస్‌ నుంచి అతడికి పోలియో సోకినట్లు తమ అధ్యయనంలో తేలిందని అమెరికా పరిశోధకులు తెలిపారు. ఈ తరహా వ్యాక్సిన్‌ను అమెరికాలో 2000 నుంచే నిలిపివేయడం గమనార్హం. ప్రస్తుతం ఇంజక్షన్‌ ద్వారా ఇచ్చే పోలియో టీకాను మాత్రమే అమెరికా కొనసాగిస్తోంది. దీనిలో మృత వైరస్‌ ఉంటుంది. చుక్కల టీకాలో అత్యంత బలహీనమైన పోలియో వైరస్‌ ఉంటుంది. తద్వారా రోగనిరోధక శక్తికి పోలియో వైరస్‌ గురించి తెలిసేలా.. భవిష్యత్తులో వస్తే దానిపై పోరాడేలా ఈ టీకా పనిచేస్తుంది. 

Updated Date - 2022-07-24T13:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising