ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రవాసుల విజయాలకు గర్విస్తున్నాం: మోదీ

ABN, First Publish Date - 2022-01-10T12:59:59+05:30

ప్రవాసభారతీయుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రవాసులకు శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రవాసభారతీయుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. 1915లో జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన రోజు(జనవరి 9)ను ఏటా ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ‘మన ప్రవాసులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. అదే సమయంలో వారు తమ మూలాలను మరువలేదు. వారి విజయాల పట్ల మేం గర్విస్తున్నాం’ అని మోదీ ట్వీట్‌ చేశారు. అలాగే దేశాభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని రెట్టింపు చేయాలని ప్రవాసులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ‘మీరు సాధించిన ఘనతలు మాకు గర్వకారణం. మన భావోద్వేగ బంధం మరింత బలపడుతోంది’ అని విదేశాంగమంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు.  

Updated Date - 2022-01-10T12:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising