ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు ఇలాగే చేస్తే ఈ రాత్రికి విమానం బయలుదేరదు.. ప్రయాణికులపై పైలట్ చిందులు!

ABN, First Publish Date - 2022-05-27T00:55:47+05:30

: విమానాలు ఆలస్యంగా బయలుదేరితే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తాయి. తమ ప్లాన్లు తలకిందులైపోయినందుకు వారి కోపం నషాళానికి అంటుతుంది. ఫలితంగా.. తమ అసంతృత్తి అంతా అక్కడి సిబ్బందిపై చూపిస్తారు. మరి.. ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల సహనానికీ ఓ హద్దు ఉంటుంది!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: విమానాలు ఆలస్యంగా బయలుదేరితే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తాయి. తమ ప్లాన్లు తలకిందులైపోయినందుకు వారి కోపం నషాళానికి అంటుతుంది. ఫలితంగా..  తమ అసంతృప్తి అంతా అక్కడి సిబ్బందిపై చూపిస్తారు. మరి.. ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల సహనానికీ ఓ హద్దు ఉంటుంది!  వారికి తిక్కరేగితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించే ఘటన ఒకటి ఇటీవలే జరిగింది. ప్రయాణికుల వరుస ఫిర్యాదులతో విసుగెత్తిపోయిన ఓ పైలట్.. చివరకు వారిపైనే చిందులు తొక్కాడు. ‘ఇక  భరించడం నావల్ల కాదు.. చేయవలసిందంతా చేశా’’ అంటూ రంకెలేశాడు. విజ్‌ఎయిర్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మే 25న లండన్ గ్యాట్‌విక్ ఎయిర్‌పోర్టు నుంచి సైప్రస్‌కు వెళ్లాల్సిన ఓ విమానం ఏకంగా 7 గంటల పాటు ఆలస్యంగా బయలుదేరింది. కొద్దిసేపట్లో టేకాఫ్ అవ్వాల్సి ఉండగా.. వారి ప్రయాణానికి బ్రేకులు పడటమే ఇందుకు కారణం. తాము చెప్పేంత వరకూ కదలొద్దని గ్రౌండ్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది స్పష్టం చేయడంతో విమానాన్ని పైలట్ యథాస్థానంలోనే నిలపాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పలుమార్లు పైలట్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు విసుక్కోవడం, మరికొందరు విమాన సిబ్బంది ముందు తమ అసంతృప్తి వ్యక్తం చేయడం.. ఇలా సాగింది విమానంలో వ్యవహారం!  సిబ్బంది మాత్రం చాలా ఓపిగ్గా ప్రయాణికులకు నచ్చజెప్పారు. వారి ఫిర్యాదులను పైలట్‌‌కు చేరవేశా‌రు. ఈ క్రమంలో మేం దిగిపోతామంటూ మరి కొందరు కోరారు. 


ఇలా ప్రయాణికులతో ఏడు గంటల పాటు వేగిన ఆ పైలట్ చివరకు ప్రయాణికులపై ఇంతెత్తున లేచాడు. ‘‘విమానం నుంచి దిగిపోవాలనుకునే వాళ్లు చేతులు లేపండి.. పంపించేస్తా!  కానీ.. అలా చేస్తే ఈ రాత్రికి విమాన ప్రయాణం ఉండదు. అయినా.. ఇదంతా భరించడం మా వల్ల కాదు. సమస్యను పరిష్కరించేందుకు చేయవలిసిందంతా చేస్తున్నాం.’’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఇక.. అతడు చెప్పేదంతా ఓ ప్రయాణికురాలు  రికార్డు చేసి టిక్‌టాక్‌లో పెట్టడంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ప్రయాణికుల పరిస్థితి చూసి జాలి పడుతూనే పైలట్‌కూ మద్దతుగా నిలిచారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు మాత్రం ఏం చేస్తారు.  పైలట్‌ ఎదుర్కొంటున్న ఒత్తిడి అతడి మాటల్లో స్పష్టంగా వ్యక్తమవుతోంది’’  అని కామెంట్ చేశారు.



Updated Date - 2022-05-27T00:55:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising