ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నార్థకంగా భారత విద్యార్థుల భవిష్యత్తు.. సుప్రీం కోర్టులో పిల్ దాఖలు

ABN, First Publish Date - 2022-03-14T17:00:54+05:30

ఉక్రెయిన్-రష్యా మధ్య గత నెల 24న యుద్ధం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సుమారు 20వేల మంది భారత విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. దీంతో ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ ప్రారంభించి.. విద్యార్థులను ఇండియాకు తరలించింది. విద్యార్థులు క్షేమంగా ఇండియాకు చేరుకున్నప్పటికీ వారి భవిష్యత్తు గందరగోళంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన భారత విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. విద్యార్థులు ఇండియాలో తమ చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఉక్రెయిన్-రష్యా మధ్య గత నెల 24న యుద్ధం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సుమారు 20వేల మంది భారత విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. దీంతో ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ ప్రారంభించి.. విద్యార్థులను ఇండియాకు తరలించింది. విద్యార్థులు క్షేమంగా ఇండియాకు చేరుకున్నప్పటికీ వారి భవిష్యత్తు గందరగోళంలో పడింది. ముఖ్యంగా వైద్య విద్యార్థులు.. నిబంధనల ప్రకారం ఇండియాలో తమ కోర్సు పూర్తి చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. దీంతో సదరు విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలోనే వైద్య విద్యార్థులు ఇండియాలో తమ చదువు పూర్తి చేసేలా నిబంధనల్లో మార్పులు చేయాలని.. ఇందుకోసం చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాణా సందీప్ బుస్సా అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ ద్వారా విద్యార్థులు తమ చదువు కొనసాగించేలా అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం ఇదే విషయంపై ప్రవాసీ లీగల్ సెల్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 




Updated Date - 2022-03-14T17:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising