ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పద్నాలుగేళ్ళ గరిష్ఠానికి పెరిగిన పెట్రోలు ధరలు

ABN, First Publish Date - 2022-03-11T21:30:30+05:30

అమెరికాలో పెట్రోలు ధరలు పద్నాలుగేళ్ళ గరిష్ఠ స్థాయికి చేరాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : అమెరికాలో పెట్రోలు ధరలు పద్నాలుగేళ్ళ గరిష్ఠ స్థాయికి చేరాయి. అయినప్పటికీ మన దేశంలో ధరల కన్నా తక్కువగానే ఉన్నాయి. ఓ గ్యాలన్ పెట్రోలు ధర మార్చి 10న 4.31 డాలర్లకు (అంటే, రూ.329కి) చేరింది. 2008 జూలై 17న ఓ గ్యాలన్ పెట్రోలు ధర 4.11 డాలర్లు ఉండేది. ఆ రికార్డు తాజాగా చెరిగిపోయింది. 


అమెరికాలో ఓ గ్యాలన్ అంటే 3.78 లీటర్లు. కాబట్టి ఓ లీటరు పెట్రోలు ధర దాదాపు రూ.86.97కు చేరింది. ఇంత ఎక్కువ ధర పలకడం పద్నాలుగేళ్ళలో ఇదే తొలిసారి. అయితే మన దేశంలో వివిధ నగరాల్లో వేర్వేరు ధరలు ఉన్నట్లుగానే అమెరికాలోని నగరాల్లో ధరలు కూడా ఉంటాయి. 


ఓ గ్యాలన్ పెట్రోలు ధర కాలిఫోర్నియాలో 5.69 డాలర్లు, నెవడాలో 4.87 డాలర్లు, హవాయిలో 4.81 డాలర్లు, ఒరేగావ్‌లో 4.72 డాలర్లు, వాషింగ్టన్‌లో 4.70 డాలర్లు పలుకుతోంది. ఈ ధరలను భారతీయ కరెన్సీలోకి మార్చితే, ఓ లీటరు పెట్రోలు ధర కాలిఫోర్నియాలో రూ.114.82, నెవడాలో రూ.98.27, హవాయిలో రూ.97.06, ఒరేగావ్‌లో రూ.95.25, వాషింగ్టన్ రూ.94.85 అన్నమాట. అయితే కన్సాస్‌లో లీటరు పెట్రోలు రూ.76.88కి లభిస్తోంది. ఓక్లహామాలో రూ.77.69కి లభిస్తోంది. 


Updated Date - 2022-03-11T21:30:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising