ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America లో వింత ఘటన.. మూడ్రోజుల నుంచి మహిళ అదృశ్యం.. ఆమె ఎక్కడుందో పెంపుడు కుక్కే కనిపెట్టింది..!

ABN, First Publish Date - 2022-05-17T00:53:32+05:30

ఇటీవల ఆపదలో పడ్డ ఓ అమెరికా మహిళను ఆమె పెంపుడు కుక్కే కాపాడింది. దీంతో.. ప్రస్తుతం ఆ శునకంపై ప్రసంశల వర్షం కురుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కుక్కలంటేనే విశ్వాసానికి ప్రతిరూపం. యజమానికి కనపడితే చాలు తోక ఊపుతూ తెగ సంబరపడిపోయే ఈ నిశ్వార్థ మూగజీవాల..ఆపదల నుంచి వారిని రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతాయి. అందుకే.. మనిషికి బెస్ట్ ఫ్రెండ్ శునకమే అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల ఆపదలో పడ్డ ఓ అమెరికా మహిళను ఆమె పెంపుడు కుక్కే కాపాడింది. దీంతో.. ప్రస్తుతం ఆ శునకంపై ప్రసంశల వర్షం కురుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


టెక్సాస్‌‌ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరానికి  చెందిన షెర్రీ నొప్పే కొంతకాలంగా డిమెన్షియా( తీవ్ర మతిమరుపు)తో సతమతమవుతోంది. గత వారం ఆమె తన కుక్కను తీసుకుని అలా వాకింగ్‌కు వెళ్లింది. కానీ.. మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని వలంటీర్లు, పోలీసులు ఆమెను వెతికిపట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మూడు రోజుల పాటు ఆమె ఇంటి సమీప ప్రాంతాల్లో విపరీతంగా గాలించినా.. ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. మరోవైపు.. డిమెన్షియా కారణంగా షెర్రీ తాను ఎక్కడ ఉందో, ఇంటికి ఎలా చేరుకోవాలో తెలీక చిక్కుల్లో పడిపోయింది. జార్జి బుష్ పార్ట్ అనే 8000 ఎకరాల సువిశాల గార్డెన్‌లో ఓ చోట అయోమయంలో చతికిలపడిపోయింది. మూడు రోజులుగా నీళ్లు తాగకపోవడంతో ఆమెకు డీహైడ్రేషన్ కూడా వచ్చింది. దీంతో.. ఆమె ఇతరులను అప్రమత్తం చేయలేని స్థితిలో పడిపోయింది. 


ఇలాంటి పరిస్థితుల్లో కూడా షెర్రీ పెంపుడు కుక్క ఆమెను వీడలేదు. ఆమె పక్కనే అలా కూర్చుండిపోయింది. ఇక శుక్రవారం తెల్లవారు జామున పార్కులోని దట్టని పొదల మధ్య కుక్క అరుపులు విన్న కొందరు వలంటీర్లు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో.. పొదల మధ్య వారికి షెర్రీ కనిపించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆమె వెన్నంటే ఉన్న పెంపుడు కుక్కపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఘటన తాలూకు వివరాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవడంతో ప్రస్తుతం అనేక మంది ఆ కుక్కను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. 



Updated Date - 2022-05-17T00:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising