ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యుడి పొరపాటు.. మలమిసర్జన చేయలేక బాధితుడి అవస్థలు

ABN, First Publish Date - 2022-09-21T03:35:07+05:30

డాక్టర్ తప్పిదం కారణంగా ఓ పేషెంట్ మలవిసర్జన చేయలేని పరిస్థితి తలెత్తింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: డాక్టర్ తప్పిదం కారణంగా ఓ పేషెంట్ మలవిసర్జన చేయలేని పరిస్థితి తలెత్తింది. అమెరికాలోని ఫ్లోరిడా(Florida) రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా వైరల్ అవుతోంది. బాధితుడు ఫ్లోరిడా ఆరోగ్య శాఖ(Florida Health Department) విభాగానికి ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్లుగా వీపు కిందభాగాన ఏర్పడిన ఓ పుండు(Sacral Wound) కారణంగా సతమతమవుతున్నాడు. ఎంతకాలానికీ పుండు మానకపోగా అపానవాయువు కారణంగా సమస్య మరింత జటిలమై, పుండు పెద్దదవసాగింది. ఈ సమస్యను సర్జరీతో పరిష్కరించే అవకాశం ఉంది. 


ఇందుకోసం పెద్ద పేగు చివరి భాగమైన కోలాన్‌ను(Colon) దారిని మళ్లించాల్సి ఉంటుంది. అయితే.. అతడికి ఆపరేషన్ చేసే సమయంలో సర్జన్ అయిన డా. స్కాట్ జెనానీ(Dr. Scott Zenoni) ఘోరతప్పిదానికి పాల్పడ్డాడు. కోలాన్ పైభాగాన్ని వంపు తిప్పేబదులు కింద భాగాన్ని పక్కకు జరిపాడు. దీంతో..మలద్వారంలో అడ్డంకి ఏర్పడి బాధితుడు మలవిసర్జన చేయలేని స్థితికి చేరుకున్నాడు. ఆపరేషన్ జరిగిన 12 రోజలు తరువాత ఈ సమస్య వెల్లడికావడంతో అక్టోబర్ 12న మరోసారి శస్త్రచికిత్స చేసి పరిస్థితిని సరిదిద్దాడు. ఆ తరువాత బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు.   


కాగా.. ఈ శస్త్రచికిత్స చేసిన డాక్టర్‌కు తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. అతడి కెరీర్‌లో తొలిసారిగా ఇలాంటి పొరపాటు జరిగింది. దీంతో.. అధికారులు జరిమానాతో సరిపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ శస్త్రచికిత్సపై మరింత అవగాహన కోసం అతడిని క్లాసులకు హాజరవమని సూచించొచ్చని సమాచారం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో వైద్యలు తమ లైసెన్స్‌ను శాశ్వతంగా కోల్పోయి, వృత్తికే దూరమయ్యే ప్రమాదం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. 

Updated Date - 2022-09-21T03:35:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising