ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: వైద్యుల నిర్వాకం.. కంటిచూపు కోల్పోయిన రోగి.. పెళ్లి సంబంధం కూడా చెడిపోయిందంటూ వ్యక్తి ఆవేదన.. కోర్టు తీర్పు ఇది

ABN, First Publish Date - 2022-07-29T16:08:17+05:30

కంటి ఆపరేషన్ సమయంలో ఇద్దరు వైద్యుల అలసత్వం కారణంగా ఓ రోగి తన కంటిచూపు కోల్పోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కంటి ఆపరేషన్ సమయంలో ఇద్దరు వైద్యుల అలసత్వం కారణంగా ఓ రోగి తన కంటిచూపు కోల్పోయాడు. దాంతో తనకు కుదిరిన పెళ్లి కూడా క్యాన్సిల్ అయిందని కోర్టు మెట్లు ఎక్కాడు. తాజాగా ఈ కేసును విచారించిన కువైత్ కోర్టు ఇద్దరు డాక్టర్లకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తికి కంటి ఆపరేషన్ నిర్వహించిన సమయంలో ఇద్దరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కంటిని శుభ్రం చేసే జెల్‌కు బదులుగా నోటిపళ్లను క్లీన్ చేసేది ఉపయోగించారు. దాంతో ఆపరేషన్ తర్వాత రోగి కంటిలో దురద మొదలైంది. అది అతని కంటి చూపును దెబ్బతీసింది.  


ఇక కంటిచూపు కోల్పోవడంతో అప్పటికే ఫిక్స్ అయిన పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయింది. దీంతో ఆ రోగి తనకు వైద్యుల వల్ల జరిగిన అన్యాయంపై కోర్టుమెట్లు ఎక్కాడు. రోగి తరఫున వాదించిన న్యాయవాది ముల్లా యూసఫ్ తన క్లయింట్‌కు వైద్యుల నుంచి భారీ పరిహారం ఇప్పించాలని కోరారు. అయితే, వైద్యులు మాత్రం రెండు జెల్స్ ఒకే కంపెనీకి చెందినవి కావడంతో పొరబడినట్లు కోర్టుకు తెలిపారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఇద్దరు వైద్యులకు ఏడాది జైలు శిక్ష విధించింది. 

Updated Date - 2022-07-29T16:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising