ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారా.. పార్ట్‌టైం జాబ్ చేయాలనుందా.. ముందు ఈ రూల్స్ తెలుసుకోండి..

ABN, First Publish Date - 2022-09-09T04:05:39+05:30

మరి ఇలా పార్ట్‌టైం జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నిబంధనలు(Rules) ఏంటంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియాలో(Australia) చదువుకుంటూ పార్ట్‌టైంగా ఉద్యోగం(Part time jobs) చేయాలనుకునే విదేశీ విద్యార్థులు కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అమెరికాలో కంటే ఆస్ట్రేలియాలో చదువుల ఖర్చు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. అక్కడి జీవినవ్యయం చాలా ఎక్కువ. కాబట్టి.. కొన్ని సార్లు ఎదోక సంపాదన మార్గం వెత్కువాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇలా పార్ట్‌టైం జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నిబంధనలు(Rules) ఏంటంటే.. 


  • ఆస్ట్రేలియాలో తరగతులు ప్రారంభం కాకమునుపే పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకునేందుకు విదేశీ విద్యార్థులకు అనుమతి ఉండదు. విద్యార్థుల సిలబస్‌ లేదా కోర్సులో కేస్ వర్క్ భాగమైనప్పుడు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. 

  • ప్రతి పదిహేను రోజుల్లో 40 గంటలకు మించి విద్యార్థులకు పని చేసుకునేందుకు అనుమతి లేదు. అంటే..తొలి వారంలో 10 గంటలు రెండో వారంలో 30 గంటలు చొప్పున లేదా తమకు నచ్చిన ఇతర విధానంలో 40 గంటలకు మించకుండా పార్ట్‌టైం జాబ్ చేసుకోవచ్చు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వీసా కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది. 

  • అయితే.. సెలవులప్పుడు పార్ట్‌టైంగా పనిచేస్తే..ఈ 40గంటల నిబంధన వర్తించదు. 

  • మాస్టర్స్ డిగ్రీ లేదా రీసెర్చ్ వర్క్ చేస్తున్న స్టూడెంట్లు థీసిస్ వర్క్ మొదలైన అనంతరం తమకు తమకు నచ్చినంత సేపు పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. వీరికి కూడా 40 గంటల నిబంధన వర్తించదు.

  • ఇక చదువు పూర్తి చేసుకున్న వారు వర్డ్ స్టడీ పర్మిట్ అనుమతి పొందాక తమకు నచ్చినట్టు పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. 

Updated Date - 2022-09-09T04:05:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising