ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘RRR’ అభిమానులను ఫాలో అవుతున్న ‘KGF-2’ ఫ్యాన్స్!

ABN, First Publish Date - 2022-04-10T23:26:29+05:30

యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్-1’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మన్ననలను పొందిన విషయం తెలిసిందే. దీంతో ‘కేజీఎఫ్: చాప్టర్-2’ కోసం అభిమానులు కొన్ని రోజులుగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. చివరిగా వారు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్-14న ప్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓవర్సిస్ సినిమా: యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్-1’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మన్ననలను పొందిన విషయం తెలిసిందే. దీంతో ‘కేజీఎఫ్: చాప్టర్-2’ కోసం అభిమానులు కొన్ని రోజులుగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. చివరిగా వారు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్-14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యశ్ అభిమానులు.. ‘కేజీఎఫ్-2’ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటూ తమదైన పద్ధతిలో ఈ చిత్రానికి ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే  డల్లాస్‌లోని అభిమానులు వినూత్నంగా ఓ వీడియోను రూపొందించి దాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. 



‘ఆర్ఆర్ఆర్’ విడుదల సందర్భంగా ఆ మూవీ అభిమానలు తమ కార్లను ‘ఆర్ఆర్ఆర్’ అక్షరాల క్రమంలో పార్క్ చేసి వీడియో షూట్ చేసినట్టే.. ఇపుడు యశ్ అభిమానులు కూడా చేశారు. కార్లను ‘కేజీఎఫ్-2’ సినిమా పేరు రూపంలో పార్క్ చేసి ఆ దృశ్యాలను డ్రోన్ కెమెరాతో షూట్ చేశారు. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఇందుక సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. యూఏఈలో సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే మూవీ క్రిటిక్ ఉమైర్ సంధూ.. ‘కేజీఎఫ్-2’ మూవీ ఫస్ట్ రివ్యూని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఇచ్చారు. ‘కేజీఎఫ్-2 ఒక పర్‌ఫెక్ట్ యాక్షన్ థిల్లర్. ఈ మూవీలో స్టైల్, సబ్జెక్ట్ రెండింటితోపాటు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. కచ్చితంగా ఇది ఒక బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. 




Updated Date - 2022-04-10T23:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising