ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

USA Box Office: బింబిసార, సీతారామం.. ఏ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చిందంటే..

ABN, First Publish Date - 2022-08-07T02:20:39+05:30

మంచి కిక్ ఇచ్చే సినిమాలు లేక సగటు తెలుగు సినిమా ప్రేక్షకులు గత రెండు నెలలుగా థియేటర్ల బాట పట్టడం లేదు. ఓటీటీల్లో వచ్చిన సినిమాలే చూస్తూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ 5న బింబిసార, సీతారామం సినిమాలు రిలీజై.. మంచి హిట్ టా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: మంచి కిక్ ఇచ్చే సినిమాలు లేక సగటు తెలుగు సినిమా ప్రేక్షకులు గత రెండు నెలలుగా థియేటర్ల బాట పట్టడం లేదు. ఓటీటీల్లో వచ్చిన సినిమాలే చూస్తూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ 5న బింబిసార(Bimbisara), సీతారామం(Sita Ramam) సినిమాలు రిలీజై.. మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో థియేటర్లు ప్రేక్షలతో కిటకిటలాడుతున్నాయి. థియేటర్ల నుంచి బయటికి వచ్చిన ప్రేక్షకుల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఇలాంటి సినిమాలు కదా మాకు కావాల్సింది అంటూ రెండు మూవీలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా బాక్సాఫీస్(USA Box Office) వద్ద ఈ రెండు సినిమాలు ఎన్ని కోట్లు రాబట్టాయనే వివరాలపై ఓ లుక్కేస్తే..



గెలుపు ఓటములను అస్సలు పట్టించుకోకుండా.. నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram).. ‘బింబిసార’గా తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలోని తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించారు. కొత్త దర్శకుడే అయినా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడం.. కళ్యాణ్ రామ్ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఈ సినిమా అక్కడ భారీ మొత్తంలో కలెక్షన్లను రాబట్టింది. 175 లొకెషన్లలో రిలీజైన ‘బింబిసార’ ఇప్పటి వరకు 1,43,826 డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.1.14కోట్లు) కలెక్ట్(USA Box Office Collections)  చేసింది. 


దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా.. బాలీవుడ్ ముద్దగుమ్మ మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా క్లాసికల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ‘సీతారామం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రజలకు ముందుకు వచ్చింది. అమెరికాలో 284 లొకేషన్లలో విడుదలైన ఈ సినిమా.. ఇప్పటి వరకు 2,18,246 డాలర్లు (భారత కరెన్సీలో రూ.1.73కోట్లు) వసూలు(USA Box Office Collections) చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 


Updated Date - 2022-08-07T02:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising