ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mayanmar: మయన్మార్‌లో ఉగ్రవాదుల చెరలో 60 మంది తమిళ టెకీలు.. వారితో సైబర్‌ నేరాలు చేయిస్తూ రోజూ చిత్రహింసలు

ABN, First Publish Date - 2022-09-21T13:17:01+05:30

మయన్మార్‌లోని వియావాడి ప్రాంతంలో 60 మంది తమిళులను ఉగ్రవాదులు నిర్బంధించారు. వారితో సైబర్‌ నేరాలు చేయిస్తూ రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మయన్మార్‌లోని వియావాడి ప్రాంతంలో 60 మంది తమిళులను ఉగ్రవాదులు నిర్బంధించారు. వారితో సైబర్‌ నేరాలు చేయిస్తూ రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న వారిని విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మక్కల్‌ నీదిమయ్యం అధినేత కమల్‌ హాసన్‌, పీఎంకే నేత డాక్టర్‌ రాందాస్‌ సహా పలువురు తమిళ రాజకీయ నేతలు డిమాండ్‌ చేశారు. మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఆధిపత్యం చెలాయిస్తూ సంఘవిద్రోహక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం వారి చెరలో 300 మందికి పైగా భారతీయులు చిత్రహింసలు అనుభవిస్తున్నారు. వాళ్లంతా దుబాయ్‌, థాయ్‌లాండ్‌ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న సమయంలో మయన్మార్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న కొంతమంది తమిళ యువకులు తమ కుటుంబీకులకు రహస్య సమాచారం పంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2022-09-21T13:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising