ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: 300 మంది ప్రవాసుల అరెస్ట్.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

ABN, First Publish Date - 2022-06-08T19:17:19+05:30

గత కొంతకాలంగా కువైత్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గత కొంతకాలంగా కువైత్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది. వరుస తనిఖీలతో కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించడం జరుగుతోంది. ఇలా గడిచిన రెండేళ్లలో కువైత్ సర్కార్ చట్టవిరుద్ధంగా దేశంలో నివాసం ఉంటున్న వేల సంఖ్యలో వలసదారులను బహిష్కరించింది. ఇదే కోవలో తాజాగా మహబౌలా ప్రాంతంలో అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 300 మందికి పైగా అక్రమంగా నివాసం ఉంటున్న ప్రవాసులు పట్టుబడ్డారు. వీరిలో కొందరు రెసిడెన్సీ గుడువు ముగిసిన వారు, మరికొందరు వివిధ నేరాల్లో దోషులని అధికారులు తెలిపారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతోనే భారీ సంఖ్యలో రెసిడెన్సీ ఉల్లంఘనదారులు పట్టుబడ్డారని సోదాలు నిర్వహించిన అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ ఇన్విస్టిగేషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. 


మునుముందు కూడా ఈ సోదారుల ఇలాగే కొనసాగుతాయన్నారు. ముఖ్యంగా జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే గడువు ముగిసిన రెసిడెన్సీ పర్మిట్లతో దేశంలో నివాసం ఉంటున్న వలసదారులకు అమ్నెస్టీ రూపంలో దేశం నుంచి వెళ్లిపోయేందుకు అవకాశం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహిరస్తున్నారని మండిపడ్డారు. ఇక తాజాగా అరెస్టైన 300 మందిలో ఎక్కువగా రెసిడెన్సీ చట్టాన్ని అతిక్రమించిన వారు ఉంటే, ఇద్దరు మాత్రం మాదకద్రవ్యాల కేసులో నిందితులని అధికారులు పేర్కొన్నారు.  

Updated Date - 2022-06-08T19:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising