ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Omicron భయం.. ఒకేరోజు 2,600 విమాన సర్వీసులు క్యాన్సిల్

ABN, First Publish Date - 2022-01-01T15:24:08+05:30

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 140 దేశాల వరకు కొత్త వేరియంట్ పాకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 140 దేశాల వరకు కొత్త వేరియంట్ పాకింది. దీంతో అంతకంతకు కొత్త కేసులు పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో సహా చాలా దేశాల్లో లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటికే చాలా దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో గడిచిన కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడం, ఆలస్యంగా నడవడం జరుగుతోంది. 2021 ఏడాది చివరి రోజు అయిన శుక్రవారం కూడా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2,600 విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. వీటిలో అమెరికాలోనే 1,200 విమానాలు ఉన్నాయి. అలాగే 4,900 వరకు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయని FlightAware.com వెల్లడించింది. ఇక క్రిస్మస్ సెలవులు కావడంతో సాధారణంగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఒమైక్రాన్ భయంతో చాలా మంది ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయని పరిస్థితి దాపురించింది. మరోవైపు కరోనా విజృంభణ నేపథ్యంలో విమాన సిబ్బందికి క్వారంటైన్, ఇతర నిబంధనలు వర్తింపజేయడం మొదలు కావడంతో భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడం జరిగిందని FlightAware.com పేర్కొంది. 


ఇదిలాఉంటే.. ఒమైక్రాన్‌ కారణంగా అమెరికాలో ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కనీవినీ ఎరుగని రీతిలో అగ్రరాజ్యంలో కొత్తగా 5.80 లక్షల కేసులు నమోదవడం అక్కడ కరోనా తీవ్రతను చాటుతోంది. వారం రోజుల సగటు చూస్తే అమెరికాలో రోజుకు 2.90 లక్షల పాజిటివ్‌లు వచ్చాయి. సీడీసీ లెక్కల ప్రకారం డిసెంబరు 22-28 మధ్య 17 ఏళ్లలోపు పిల్లలు.. రోజుకు 370 మంది పైగా కరోనాతో ఆస్పత్రుల్లో చేరారు. అంతకుముందటి వారంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం కావడం గమనార్హం. గత సెప్టెంబరులో అమెరికాలో వైరస్‌ ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఈ సంఖ్య 342 మాత్రమే. కాగా, మొత్తమ్మీద దేశంలో రోజుకు 10,200 మంది కరోనాతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాలకు గాను 18 రాష్ట్రాల్లో గత గరిష్ఠ సంఖ్యను మించి కేసులు వస్తున్నాయి. రాజధాని వాషింగ్టన్‌ డీసీ, మేరీల్యాండ్‌, ఒహియో తదితర రాష్ట్రాల్లో ఆస్పత్రులో చేరికలు 27 శాతం పెరిగాయి. యూఎస్‌లో రోజురోజుకు కరోనా పెరుగుతున్న నేపథ్యంలోనే భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. విమానయాన సంస్థలకు కోవిడ్ నిబంధనల మధ్య సర్వీసులు నడపడం తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. దీంతో చాలా వరకు విమాన సర్వీసులకు క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి.  

Updated Date - 2022-01-01T15:24:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising