ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Oman: విదేశీ పెట్టుబడిదారులకు 217 దీర్ఘకాలిక వీసాల జారీ

ABN, First Publish Date - 2022-03-17T18:16:10+05:30

2021 అక్టోబర్‌లో తీసుకువచ్చిన ఇన్వెస్టర్ రెసిడెన్సీ ప్రొగ్రామ్(ఐఆర్‌పీ) ద్వారా ఒమన్ వాణిజ్యం, పరిశ్రమలు, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ మంత్రిత్వశాఖ.. రాయల్ ఒమన్ పోలీస్(ఆర్ఓపీ) సమన్వయంతో ఇప్పటివరకు వివిధ దేశాలకు చెందిన వారికి సుమారు 217 ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్డులను జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: 2021 అక్టోబర్‌లో తీసుకువచ్చిన ఇన్వెస్టర్ రెసిడెన్సీ ప్రొగ్రామ్(ఐఆర్‌పీ) ద్వారా ఒమన్ వాణిజ్యం, పరిశ్రమలు, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ మంత్రిత్వశాఖ.. రాయల్ ఒమన్ పోలీస్(ఆర్ఓపీ) సమన్వయంతో ఇప్పటివరకు వివిధ దేశాలకు చెందిన వారికి సుమారు 217 ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్డులను జారీ చేసింది. వీటిలో 142 కార్డులు 10ఏళ్ల కేటగిరీ, 73 కార్డులు 5ఏళ్ల కేటగిరీకి సంబంధించినవి కాగా, మిగతా రెండు పదవీవిరమణ పొందిన విభాగానికి సంబంధించినవి. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లకు సుల్తానేట్ ఇలా ఐఆర్‌పీ ద్వారా దీర్ఘకాలిక వీసా కార్డులను జారీ చేస్తోంది. ప్రస్తుతం జారీ చేస్తున్న వీసా కార్డులు 10, 5ఏళ్ల కాలపరిమితితో ఉంటాయి. ఆ తర్వాత వాటిని రెన్యువల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక ఈ రెసిడెన్సీ కార్డుల కోసం విదేశీ పెట్టుబడిదారులు వాణిజ్యం, పరిశ్రమలు, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.      

Updated Date - 2022-03-17T18:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising