ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eid Al Fitr 2022: యూఏఈలో వారం రోజులు సెలవులు

ABN, First Publish Date - 2022-04-22T13:54:57+05:30

ఈద్ అల్ ఫితర్‌కు యూఏఈ సర్కార్ ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఆ దేశ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: ఈద్ అల్ ఫితర్‌కు యూఏఈ సర్కార్ ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఆ దేశ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో ఏప్రిల్ 30(శనివారం) నుంచి మే 6(శుక్రవారం) వరకు వారం రోజులు సెలవులు ఉండనున్నాయి. దేశంలోని అన్ని మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని కేబినెట్ స్పష్టం చేసింది. మళ్లీ మే 9న(సోమవారం) కార్యాలయాలు తెరచుకుంటాయని, అప్పుడు యధావిధిగా విధులకు హాజరు కావాలని ఉద్యోగులను సూచించింది. మధ్యలో మే 7(శనివారం), మే 8(ఆదివారం) రెండు రోజులు అదనంగా సెలవులు కలిసిరావడంతో మొత్తంగా 9 రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి వద్దే ఉండనున్నారు. ఈ తొమ్మిది రోజులు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు మూతపడనున్నాయి. యూఏఈ తాజా నిర్ణయంతో అటు షార్జా కూడా రంజాన్ సెలవులను పొడిగించింది. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు హాలీడేస్ ఇచ్చింది. 


ఇక యూఏఈలోని మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వశాఖ.. ప్రైవేట్ సెక్టార్‌కు ఐదు రోజుల సెలవులు ప్రకటించింది. శనివారం (ఏప్రిల్ 30), ఆదివారం (మే 1), సోమవారం (మే 2), మంగళవారం(మే 3), బుధవారం (మే 4) వరుసగా ఐదు రోజులు సెలవులిచ్చింది. అయితే, ఇది చంద్రవంక కనిపించే దానిపై ఆధారపడి ఉంటుందని ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ (ఈఏఎస్) పేర్కొంది. (ఈఏఎస్) అంచనా ప్రకారం రంజాన్ పండుగ మే 2న ఉండనుంది.

Updated Date - 2022-04-22T13:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising