ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాకు మళ్లీ మన మామిడి.. తెలుగు రైతులకూ ప్రయోజనం

ABN, First Publish Date - 2022-01-12T13:11:48+05:30

రెండేళ్ల తర్వాత అమెరికా మార్కెట్లో మళ్లీ మన మామిడి పండ్లు కనిపించబోతున్నాయి. అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ (యూఎ్‌సడీఏ) ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మామిడి సీజన్‌ ప్రారంభానికి ముందే అమెరికా ఇందుకు అనుమతించడం విశేషం. దీంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రైతులకూ మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రెండేళ్ల తర్వాత అమెరికా మార్కెట్లో మళ్లీ మన మామిడి పండ్లు కనిపించబోతున్నాయి. అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ (యూఎ్‌సడీఏ) ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మామిడి సీజన్‌ ప్రారంభానికి ముందే అమెరికా ఇందుకు అనుమతించడం విశేషం. దీంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రైతులకూ మేలు జరుగుతుందని భావిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో అమెరికా అధికారులు.. భారత్‌లోని ఇర్రేడియేషన్‌ కేంద్రాలను తనిఖీ చేయలేక రెండేళ్లుగా ఈ ఎగుమతులు ఆగిపోయాయి. కొవిడ్‌ పరిస్థితులు సద్దుమణిగే వర కు కొన్ని మార్గదర్శకాలకు లోబడి ఈ దిగుమతులకు అమెరికా అంగీకరించింది. ఇం దుకు బదులుగా భారత్‌ కూడా అమెరికా నుంచి చెర్రీలు, దాణాలో ఉపయోగించే అ ల్ఫాల్ఫా అనే గడ్డి దిగుమతులకు అంగీకరించింది. 2019-20లో మన దేశం నుంచి అమెరికాకు 43.5 లక్షల డాలర్ల విలువైన 1,095 మెట్రిక్‌ టన్నుల మామిడి పండ్లు ఎగుమతయ్యాయి. తాజా నిర్ణయంతో ఈ సంవత్సరం ఎగుమతులు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నారు.  కాగా, మామిడి పండ్ల దిగుమతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అమెరికా.. భారత్‌కు తన పంది మాంసం, దాని ఉత్పత్తుల ఎగుమతికి అనుమతి సాధించింది. త్వరలోనే ఈ ఎగుమతులు ప్రారంభమవుతాయని అమెరికా వాణిజ్య, వ్యవసాయ మంత్రిత్వ శాఖ లు ప్రకటించాయి.

Updated Date - 2022-01-12T13:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising