ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1229 ఏళ్లలో ఒక్కసారి కూడా జరగనిది ఈసారి జరిగింది.. కరోనా దెబ్బ మామూలుగా లేదుగా..!

ABN, First Publish Date - 2022-02-08T02:10:46+05:30

బ్రిటన్‌లో అత్యంత పురాతనమైనదిగా పేరుపడ్డ ‘యీ ఓల్డ్ ఫైటింగ్ కాక్స్’ పబ్ తాజాగా మూతపడింది. క్రీస్తుశకం 793లో ప్రారంభమైన ఈ పబ్ కొన్ని వందల ఏళ్ల పాటు ఏకధాటిగా కార్యకలాపాలు కొనసాగించి, చివరకు కరోనా దెబ్బకు తాళలేక కుప్పకూలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే తగిలింది. కరోనా భయానికి ప్రజలు ప్రయాణాలు తగ్గించుకోవడంతో హాస్పటాలికీ రంగం కకావికలమైపోయింది. అనేక దేశాల్లో రెస్టారెంట్లు, పబ్స్ మూత పడ్డాయి. కరోనా ‘అలల’ తాకిడికి కూలబడిపోయిన వ్యాపారాలు ఇప్పటికీ కోలుకోలేదు. ఈ క్రమంలోనే బ్రిటన్‌లో అత్యంత పురాతనమైనదిగా పేరుపడ్డ ‘యీ ఓల్డ్ ఫైటింగ్ కాక్స్’ పబ్ తాజాగా మూతపడింది. క్రీస్తుశకం 793లో ప్రారంభమైన ఈ పబ్ కొన్ని వందల ఏళ్ల పాటు ఏకధాటిగా కార్యకలాపాలు కొనసాగించి, చివరకు కరోనా దెబ్బకు తాళలేక కుప్పకూలింది. డిమాండ్ పడిపోవడంతో భారీగా నష్టాలు వచ్చాయని పబ్ నిర్వహకుడు తాజాగా తెలిపారు. పబ్ శాశ్వతంగా మూతపడకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నా చేశామని ఫేస్‌బుక్ ద్వారా పేర్కొన్నారు.


 ‘‘పబ్ కార్యకలాపాలు కొనసాగించేందుకు నేను, నా టీం ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ.. ఈ రెండేళ్లలో మేము ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు అంతకుమునుపెన్నడూ చూడలేదు. ఈ సంక్షోభాన్ని ఎదిరించి నిలవలేకపోయాం.’’ అని క్రిస్టో టొఫాలీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం బ్రిటన్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.  అయితే.. కరోనా సంక్షోభానికి పూర్వమే పబ్ ఆర్థిక కష్టాల్లో ఉన్నట్టు సమచారం. ముఖ్యంగా బ్రిటన్‌లో విపరీతంగా పెరిగిన వ్యాపార నిర్వహణ కర్చులు, పన్నులు ఈ పబ్‌కు ఇబ్బందికరంగా మారాయట. అయితే.. శక్తియుక్తులన్నీ కూడ దీసుకున్న నిర్వహుకులు పబ్‌ను ఐదేళ్లలో గాడినపెట్టేలా ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు. కానీ.. కరోనా సంక్షోభం వారి ప్రణాలికలన్నిటినీ తల్లకిందులు చేయడంతో చివరికి ఈ పురాతన పబ్ మూతపడిపోయింది. 

Updated Date - 2022-02-08T02:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising