ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dubai: ఆరేళ్ల తర్వాత దుబాయ్‌లో అనూహ్య పరిణామం.. లండన్, న్యూయార్క్ నగరాలను వెనక్కి నెట్టి మరీ..

ABN, First Publish Date - 2022-09-08T19:05:07+05:30

ఆకాశహర్మ్యాలకు పెట్టింది పేరు దుబాయ్ (Dubai) నగరం. సువిశాలమైన, ఆకాశాన్ని తాకే భవంతిలతో పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తోందీ నగరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: ఆకాశహర్మ్యాలకు పెట్టింది పేరు దుబాయ్ (Dubai) నగరం. సువిశాలమైన, ఆకాశాన్ని తాకే భవంతిలతో పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తోందీ నగరం. ఇక సౌకర్యాల విషయంలో కూడా ఎలాంటి ఢోకా ఉండదు. దాంతో ప్రవాసులు, ఇతర దేశాల కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. అయితే, ఈ విషయంలో దుబాయ్ కంటే న్యూయార్క్ (New York), లండన్ నగరాలు ఎప్పుడు ఒక్క అడుగు ముందు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆరేళ్ల తర్వాత ఉన్నట్టుండి దుబాయ్‌లో ఆఫీస్ భవనాల కిరాయిలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి కారణం కార్యాలయాల కోసం భవంతిలకు భారీ డిమాండ్ ఉండటమేనని తెలిసింది. ఎంతలా అంటే న్యూయార్క్, లండన్ నగరాలను సైతం దుబాయ్ (Dubai) ఇప్పుడు వెనక్కి నెట్టింది. 


ప్రస్తుతం దుబాయ్‌లో రెంటల్ భవనాల కోసం ప్రవాస సంస్థలు భారీగా పోటీ పడుతున్నాయట. ముఖ్యంగా బ్యాంకింగ్, వ్యాపార సముదాయాల విస్తరణ రోజురోజుకూ పెరుగుతుండడంతో ఇతర దేశాల వారికి అంతర్జాతీయ కార్యాలయాల ఏర్పాటుకు దుబాయ్ ఒక మంచి ఆప్షన్‌గా మారింది. అలాగే ప్రవాసులకు వీసా ప్రాసెస్‌ను కూడా యూఏఈ ఇటీవల మరింత సులభతరం చేసింది. దాంతో విదేశీ కంపెనీలకు తమ ఉద్యోగులను ఇక్కడి పంపించడం మరింత సులువుగా మారింది. ఈ కారణాలతోనే దుబాయ్‌లో ఆఫీస్ భవనాల కోసం న్యూయార్క్, లండన్ (London) నగరాల కంటే కూడా ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది.  

Updated Date - 2022-09-08T19:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising