ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఎన్నారైలకు గుడ్‌న్యూస్.. విదేశాల నుంచి స్వదేశంలోని కుటుంబ సభ్యుల బిల్లులు చెల్లించే వెసులుబాటు

ABN, First Publish Date - 2022-08-06T13:16:17+05:30

ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) సైతం స్వదేశంలోని కుటుంబ సభ్యుల తరఫున యుటిలిటీ బిల్లులు, విద్యా రుసుమును భారత్‌ బిల్‌ పేమెంట్‌ వ్యవస్థ (బీబీపీఎస్‌) ద్వారా చెల్లించే వెసులుబాటు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌, గ్యాస్‌, డీటీహెచ్‌ వంటి యుటిలిటీ బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వదేశంలోని కుటుంబ సభ్యుల బిల్లులు బీబీపీఎస్‌ ద్వారా చెల్లించే అవకాశం

ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) సైతం స్వదేశంలోని కుటుంబ సభ్యుల తరఫున యుటిలిటీ బిల్లులు, విద్యా రుసుమును భారత్‌ బిల్‌ పేమెంట్‌ వ్యవస్థ (బీబీపీఎస్‌) ద్వారా చెల్లించే వెసులుబాటు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌, గ్యాస్‌, డీటీహెచ్‌ వంటి యుటిలిటీ బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికే బీబీపీఎస్‌. ఈ ఇంటరాపరబుల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా బిల్లు చెల్లింపులకు 20,000కు పైగా ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ వేదిక ద్వారా నెలకు 8 కోట్లకు పైగా చెల్లింపు లావాదేవీలు జరుగుతున్నాయి.


త్వరలోనే బీబీపీఎ్‌సను విదేశాల నుంచి బిల్లు చెల్లింపులను స్వీకరించే వ్యవస్థగా ఆధునీకరించాలని ప్రతిపాదించినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. తద్వారా సీనియర్‌ సిటిజన్లకు అధిక ప్రయోజనం చేకూరనుంది. ఎందుకంటే, లక్షలాది మంది భారత యువతీ యువకులు విదేశాల్లో స్థిరపడ్డారు. ఆర్‌బీఐ తాజా ప్రతిపాదనతో స్వదేశంలోని వారి తల్లిదండ్రుల యుటిలిటీ బిల్లు చెల్లింపుల ప్రక్రియ మరింత సులుభం కానుంది. 

Updated Date - 2022-08-06T13:16:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising