ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America వెళ్లాలనుకునే భారత యువతకు ముఖ్య గమనిక.. భారత్‌లో ఉన్నప్పుడు కూడా ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి..!

ABN, First Publish Date - 2022-07-20T00:49:14+05:30

డాలర్ కలలతో అమెరికా చేరుకుంటున్న భారతీయ యువతకు ఓ ముఖ్యగమనిక..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: డాలర్ కలలతో అమెరికా చేరుకుంటున్న భారతీయ యువతకు(NRI) ఓ ముఖ్యగమనిక..! అగ్రరాజ్యంలో కాలుపెట్టామన్న ఆనందంలో తెగ ఎంజాయ్ చేస్తున్నామనుకుని డ్రంకన్‌ డ్రైవ్‌ కేసుల్లో మాత్రం చిక్కుకోకండి. అమెరికా చట్టాల ప్రకారం.. ఇటువంటి కేసుల్లో ఇరుక్కున్న వారి కెరీర్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇటువంటి వారు అమెరికా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థల్లో ఉద్యోగాన్ని పొందలేరు. అంతేకాకుండా.. రెండు సార్లు డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో(Drunk and drive cases) పట్టుబడిన వారిని అమెరికా ప్రభుత్వం వారి వారి స్వదేశాలకు పంపించేస్తుంది. అంతేకాకుండా.. ఇలాంటి ముద్రపడ్డ వారికి మరెన్నడూ అమెరికా వీసా లభించకపోవచ్చు. అమెరికా కలలకు శాశ్వతంగా దూరమైపోవచ్చు! 


ఇప్పటికే అమెరికాలో ఎంతో మంది భారతీయ యువత మద్యం మత్తులో పోలీసులకు చిక్కి తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారు. కొందరు స్వదేశానికి తిరిగొచ్చేశారు కూడా..! కాబట్టి.. విద్యార్థులైనా, హెచ్-1బీ వీసాపై ఉంటున్న ఉద్యోగులైనా.. డ్రంకన్ డ్రైవ్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలనేది కొందరి అనుభవాలు చెబుతున్న గుణపాఠం. ఇక కార్లలో ప్రయాణించే వారి విషయంలో అమెరికా పోలీసులు నిత్యం ఓ కన్నేసి ఉంచుతారట. నిబంధనలు తుంగలో తొక్కే వారిని పట్టుకునేందుకు సివిల్ దుస్తుల్లో ప్రైవేటు కార్లలో మాటు వేసి, వారి ఆటకట్టిస్తారట! అమెరికాలోనే కాదు స్వదేశంలో ఉన్నా సరే ఈ మిస్టేక్‌ మాత్రం అస్సలు చేయకండి..!

Updated Date - 2022-07-20T00:49:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising