ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ టీవీ, చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనీల్ కూర్మాచలం నియామకం.. NRIల శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2022-06-27T01:39:55+05:30

తెలంగాణ రాష్ట్ర టీవీ అండ్ చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఈరోజు హైదరాబాద్‌లో పదవి భాద్యతలు స్వీకరించిన శుభసందర్భంగా అనిల్ కూర్మాచలానికి ఎన్నారై తెరాస సెల్ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ రాష్ట్ర టీవీ అండ్ చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఈరోజు హైదరాబాద్‌లో పదవి భాద్యతలు స్వీకరించిన శుభసందర్భంగా అనీల్ కూర్మాచలానికి ఎన్నారై తెరాస సెల్ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారై శాఖ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఆండాలోస్ గార్డెన్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.   


ఈ సంధర్భంగా ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎన్నారై టీఆరెఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నారైలంతా హర్షం వక్తం చేస్తున్నట్టు  పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఖండాంతరాలలో టీఆరెఎస్ ఎన్నారై విభాగాన్ని స్థాపించి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడం ప్రతి ప్రవాస బిడ్డకు దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు.  తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఎన్నారైలు టీఅర్ఎస్ పార్టీకి సైనికులుగా పనిచేసారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమం, పర్యాటకంతోపాటు సాంస్కృతిక రంగాలను ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. ముఖ్యంగా తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారని చెప్పారు. 


ఈ సంబరాలలో ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు సంగేపు దేవన్న, చెంన్సమనేని రాజేందర్, ఉత్కం కిరణ్ గౌడ్ తెరాస నాయుకులు పాలుపంచుకున్నారు. 

Updated Date - 2022-06-27T01:39:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising