ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI TDP-USA ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2022-04-20T18:57:26+05:30

అతడే ఒక సైన్యంగా 44 ఏళ్లుగా అలుపెరుగని రాజకీయ ప్రస్థానాన్ని అవలీలగా పూర్తి చేసుకున్న ఒకే ఒక్కడు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలో 50 నగరాల్లో చంద్రబాబు 72వ జన్మదిన వేడుకలు

అతడే ఒక సైన్యంగా 44 ఏళ్లుగా అలుపెరుగని రాజకీయ ప్రస్థానాన్ని అవలీలగా పూర్తి చేసుకున్న ఒకే ఒక్కడు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రజల కోసం ఇటు వ్యక్తిగత జీవితంలో అటు రాజకీయ జీవితంలో ఎన్నో త్యాగాలను చేసిన చంద్రబాబు ఈ ఏడాది ఏప్రిల్ 20న 72వ వడిలోకి అడుగుపెట్టారు. ఏడు పదుల వయసులోనూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్న రాజకీయ యోధుడు చంద్రబాబు.


ఈ క్రమంలోనే చంద్రబాబు జన్మదిన వేడుకలను అమెరికాలో నభూతో న భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించారు ‘NRI TDP - USA’ కార్యకర్తలు. అమెరికాలోని 50కు పైగా నగరాలలో అత్యంత వైభవంగా చంద్రబాబు జన్మదిన వేడుకలను టీడీపీ ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 19వ తేదీ సాయంత్రం నుంచి చంద్రబాబు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు గడ్డపై ఎంతో ముందుచూపుతో హైటెక్ సిటీ రూపంలో చంద్రబాబు వేసిన అభివృద్ధి బీజాలు నేడు అమెరికాలోని ఐటీ రంగంలో మహా వృక్షాలుగా మారాయి.


తెలుగువారి శక్తి సామర్థ్యాలకు తిరుగేలేదని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత చంద్రబాబుదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే తెలుగు యువతకు విదేశాలలో బంగారు భవిత ప్రసాదించిన అభ్యుదయవాది, నాయకత్వ స్ఫూర్తి ప్రదాత చంద్రబాబు జన్మదిన వేడుకలలో భారీ సంఖ్యలో టీడీపీ ఎన్నారైలు పాల్గొన్నారు. దాదాపు 50కు పైగా నగరాలలో ఈ వేడుకలు  ‘NRI TDP-USA కార్యకర్తల’  ఆధ్వర్యంలో  అంబరాన్నంటేలా జరిగాయి.






Updated Date - 2022-04-20T18:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising