ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారాగ్లైడింగ్‌ చేస్తూ.. పర్వతాల్లో చిక్కుకుపోయిన NRI.. చివరకు..

ABN, First Publish Date - 2022-04-22T22:03:31+05:30

పారాగ్లైడింగ్ చేస్తూ వాతావరణం అనుకూలించక పర్వతాల్లో ల్యాండైన ఎన్నారై ఉదంతం చివరకు సుఖాంతమైంది. ఎయిర్ హిమాలయాస్ హెలికాఫ్టర్ సర్వీసు వారు గురువారం ఎన్నారై ఆచూకి తెలుసుకుని ఆయనను రక్షించారు. ఢిల్లీకి చెందిన సుమిత్‌కు పారాగ్లైడింగ్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనాలీ: పారాగ్లైడింగ్ చేస్తూ వాతావరణం అనుకూలించక పర్వతాల్లో ల్యాండైన ఎన్నారై ఉదంతం చివరకు సుఖాంతమైంది. ఎయిర్ హిమాలయాస్ హెలికాఫ్టర్ సర్వీసు వారు గురువారం ఎన్నారై ఆచూకి తెలుసుకుని ఆయనను రక్షించారు. ఢిల్లీకి చెందిన సుమిత్‌కు పారాగ్లైడింగ్‌లో విస్తృత అనుభవం ఉంది. కాగా.. బుధవారం ఆయన హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలోయలోగల బిర్ ప్రాంతం నుంచి పారాగ్లైండింగ్ ప్రారంభించారు. మనాలీలో ల్యాండవ్వాలనేది ఆయన ప్లాన్. అయితే.. సుమిత్ బయలుదేరిన కొద్ది సేపటికే.. వాతవరణం అనుకూలించకపోవడంతో ఆయన ఎమర్జెన్సీగా ల్యాండవ్వాల్సి వచ్చింది. బారా బంగల్ ప్రాంతం వద్ద దౌళధర్ పర్వతాల్లో ఆయన అత్యవసరంగా దిగిపోయారు. ఆ తరువాత వెంటనే ఈ విషయాన్ని తన స్నేహితులకు చేరవేశారు.


సుమిత్ పర్వతాల్లో చిక్కుకుపోయిన విషయాన్ని ఆయన స్నేహితులు ఎయిర్ హిమాలయా సంస్థకు చెప్పడంతో వారు హెలికాఫ్టర్ సాయంతో మరుసటి రోజు ఉదయమే గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు సుమిత్ ఆచూకీని గుర్తించి ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ క్రమంలో సుమిత్ బుధవారం రాత్రంతా పర్వతాల్లోనే ఒంటరిగా గడపాల్సి వచ్చింది. అయితే.. సుమిత్‌ను రక్షించిన అనంతరం ఆయనకు వైద్య పరీక్షల్లో చేయగా ఆరోగ్యంగానే ఉన్నట్టు తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక.. తానున్న ప్రాంతాన్ని సహాయక సిబ్బంది సులువుగా గుర్తించేందుకు సుమిత్ పలు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా.. తన పారాషూట్‌ను నేలపై విశాలంగా పరిచి సహయక సిబ్బందికి స్పష్టంగా కనిపించేలా చేశారు. 


ఏమిటీ పారాగ్లైడింగ్.. 

పారాషూట్ సాయంతో వినీలాకాసంలో విహంగంలా స్వేఛ్చగా విహరించడమే పారాగ్లైడింగ్. ఇదో సాహస క్రీడ. భారత్‌లో పారాగ్లైడింగ్‌కు అత్యంత అనుకూలమైన ప్రాంతాల్లో కాంగ్రాలోయది ప్రథమ స్థానం. లోయలు, పర్వతాలతో కూడిన భౌగోళిక పరిస్థితులే ఇందుకు కారణం. 

Updated Date - 2022-04-22T22:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising