ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US: కోడలు విడాకులు అడిగిందని.. ఎన్నారై మామ ఎంతకు తెగించాడంటే..

ABN, First Publish Date - 2022-10-07T17:05:15+05:30

అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడి నుంచి విడాకులు అడిగిన కోడలిని సొంత మామ అతి కిరాతకంగా తుపాకీతో కాల్చి చంపాడు. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ జోస్‌లో ఈ దారుణం జరిగింది. దాంతో హత్యకు పాల్పడిన 74 ఏళ్ల ఎన్నారై వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఫ్రెస్నోలో ఉండే సితల్ సింగ్ దొసంఝా కుమారుడితో గుర్‌ప్రీత్ కౌర్ దొసంఝాకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లు వీరి కాపురం బాగానే కొనసాగింది. ఆ తర్వాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో గుర్‌ప్రీత్ కౌర్ భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి అతనికి దూరంగా ఉంటుంది. శాన్ జోస్‌లో ఉండే తన మేనమామ వద్ద ఉంటూ వాల్‌మార్ట్‌లో పని చేస్తోంది. 


దాంతో తన కొడుకును వద్దనుకుని వెళ్లిపోయిన గుర్‌ప్రీత్ కౌర్‌పై మామ సీతల్ సింగ్ కక్ష్య పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలనుకున్నాడు. ఈ క్రమంలో గతవారం ఆమె పనిచేసే శాన్ జోస్‌లోని వాల్‌మార్ట్‌కు వెళ్లాడు. గుర్‌ప్రీత్ కౌర్‌ను కలిసి నీతో మాట్లాడాలని బయటకు తీసుకువచ్చాడు. మామ, కోడలు కలిసి కింద ఉన్న పార్కింగ్ లాట్‌కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు కోడలితో మాట్లాడిన తర్వాత తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో సీతల్ సింగ్ ఒక్కసారిగా ఆమెపై కాల్పులకు తెగపడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు గుర్‌ప్రీత్ కౌర్ ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే రెండు బుల్లెట్లు ఆమె శరీరం నుంచి దూసుకెళ్లాయి. ఆమె కిందపడిపోయిన తర్వాత సీతల్ సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 


ఇక చాలా సేపటివరకు గుర్‌ప్రీత్ కౌర్ తిరిగి విధులకు రాకపోవడంతో తోటి ఉద్యోగి ఒకరు అనుమానంతో కింద పార్కింగ్ లాట్‌కు వెళ్లి చూశారు. అక్కడ ఆమె విగతజీవిగా కనిపించింది. దాంతో వెంటనే వాల్‌మార్ట్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. అలాగే గుర్‌ప్రీత్ కౌర్ మేనమామకు కూడా ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దాంతో ఈ హత్యకు పాల్పడింది సీతల్ సింగ్ అని గుర్తించారు. అనంతరం అతడు నివాసం ఉండే ఫ్రెస్నోకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తన కుమారుడి నుంచి గుర్‌ప్రీత్ కౌర్ విడాకులు కోరడంతోనే హత్య చేసినట్లు సీతల్ సింగ్ అంగీకరించాడు. 

Updated Date - 2022-10-07T17:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising