ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI అనిల్‌కు అత్యున్నత పదవి.. ప్రవాసీయుల హర్షం

ABN, First Publish Date - 2022-06-24T15:15:03+05:30

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారిగా ప్రవాసీయుడు అనిల్‌ కుర్మాచలంను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చలన చిత్ర, టెలివిజన్‌, థియేటర్‌ అభివృద్ధి మండలి (ఎఫ్‌డీసీ) అధ్యక్షుడిగా నియమించడంపై విదేశాల్లోని తెలంగాణ ప్రవాసీయుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రవాసీ అనిల్‌కు ఎఫ్‌డీసీ పదవి.. ప్రవాసీయుల నుంచి సానుకూల స్పందన 

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారిగా ప్రవాసీయుడు అనిల్‌ కుర్మాచలంను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చలన చిత్ర, టెలివిజన్‌, థియేటర్‌ అభివృద్ధి మండలి (ఎఫ్‌డీసీ) అధ్యక్షుడిగా నియమించడంపై విదేశాల్లోని తెలంగాణ ప్రవాసీయుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. కరీంనగర్‌కు చెందిన అనిల్‌ దశాబ్దానికి పైగా బ్రిటన్‌లో ఉంటున్నారు, యూరప్‌లో ఆయన తెలంగాణ ప్రత్యేక ఉద్యమం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ పక్షాన పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. గల్ఫ్‌ దేశాల్లోని పార్టీ అభిమానులతో నిరంతరం సంప్రదింపులు జరిపేవారు. కాగా, ఇప్పటికే ప్రవాసీయుడు చెన్నమనేని రమేశ్‌ వేములవాడ శాసనసభ్యుడిగా కొనసాగుతుండగా, మరో ప్రవాసీయుడు శానంపూడి సైదిరెడ్డి హుజూర్‌నగర్‌ శాసన సభ్యుడిగా ఉన్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అనిల్‌ను ఎఫ్‌డీఈ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో మొదటిసారిగా ఓ ప్రవాసీయునికి అవకాశం కల్పించినట్లయింది. 

Updated Date - 2022-06-24T15:15:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising