ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE కీలక ప్రకటన.. ఇకపై ప్రవాసుల పాస్‌పోర్ట్స్‌పై నో రెసిడెన్సీ వీసా స్టాంప్స్!

ABN, First Publish Date - 2022-04-06T14:31:45+05:30

యూఏఈలోని ప్రవాసులు ఇకపై వారి పాస్‌పోర్టులపై రెసిడెన్సీ వీసాలను ముద్రించాల్సిన అవసరం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: యూఏఈలోని ప్రవాసులు ఇకపై వారి పాస్‌పోర్టులపై రెసిడెన్సీ వీసాలను ముద్రించాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 11 తర్వాత జారీ చేయబడిన నివాస పత్రాలకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు గుర్తింపు, పౌరసత్వం, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ కోసం ఫెడరల్ అథారిటీ ఒక ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం నివాసితుల ఎమిరేట్స్ ఐడీ వారి రెసిడెన్సీ పర్మిట్‌గా పరిగణించబడుతుంది. ఈ ఐడీలో రెసిడెన్సీకి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఎయిర్‌లైన్లు నివాసితుల ఎమిరేట్స్ ఐడీ, పాస్‌పోర్ట్ నంబర్ ద్వారా రెసిడెన్సీ స్టేటస్‌ను ధృవీకరించాల్సి ఉంటుంది. ఇక రెసిడెన్సీ వీసా అనేది ప్రవాసులు వైద్య పరీక్ష చేయించుకున్న తర్వాత వారి పాస్‌పోర్టులపై స్టాంప్ చేసే స్టిక్కర్. నివాసి కలిగి ఉన్న వీసా ఆధారంగా ఇది రెండు, మూడు, ఐదు లేదా పదేళ్ల కాల పరిమితితో జారీ చేయడం జరుగుతుంది. 


రెసిడెన్సీ వీసా స్టిక్కర్ అంటే ఏమిటి?

రెసిడెన్సీ వీసా అనేది ప్రవాసీకి జారీ చేయడం జరుగుతుంది. ఎంట్రీ పర్మిట్ లేదా విజిట్ వీసాను ఉపయోగించి యూఏఈలోకి ప్రవేశించిన తర్వాత అతను/ఆమె ఇప్పటికే దేశంలో ఉన్నప్పుడు నివాస వీసా జారీ చేస్తారు. “నివాస వీసా కోసం 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న దరఖాస్తుదారులు వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నారని నిరూపించుకోవడానికి వైద్య పరీక్ష చేయించుకోవాలి. వారు తప్పనిసరిగా భద్రతా తనిఖీని కూడా పాస్ కావాలి. అలాగే ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ నుండి ఎమిరేట్స్ ఐడీ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి” అని యూఏఈ ప్రభుత్వ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ ప్రక్రియ ముగింపులో నివాస వీసా స్టిక్కర్ దరఖాస్తుదారు పాస్‌పోర్ట్‌పై స్టాంప్ చేయబడుతుంది.

Updated Date - 2022-04-06T14:31:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising