ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోపీ వేలానికి పెట్టిన డోనాల్డ్ ట్రంప్ భార్యకు ఊహించని షాక్..!

ABN, First Publish Date - 2022-01-31T23:25:02+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మేలానియా ట్రంప్‌కు తాజాగా ఊహించని పరిస్థితి ఎదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మేలానియా ట్రంప్‌కు తాజాగా ఊహించని పరిస్థితి ఎదురైంది. భారీ ధరకు అమ్ముడుపోతాయనుకుంటూ ఆమె కొన్ని వస్తువులను వేలానికి పెట్టగా.. చివరికి నిరాశే ఎదురైంది. గతంలో తాను ధరించిన ఓ టోపీ, ఆ టోపీ పెట్టుకోగా తీసిన ఓ ఫొటో, అదే ఫొటోకు సంబంధించిన ఓ నాన్ ఫంజిబుల్ టోకెన్‌ను మెలానియా వేలానికి పెట్టారు. గతంలో అమెరికా ఫస్ట్ లేడీ హోదాలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా మెలానియా ఆ టోపీని ధరించారు. అయితే.. ఓపెనింగ్ బిడ్ 2.5 లక్షల డాలర్లు కాగా.. కేవలం 1.7 లక్షల డాలర్లకే ఈ మూడు వస్తువులు అమ్ముడుపోయాయి. 


సొలానా క్రిప్టోకరెన్సీ ద్వారానే చెల్లింపులు చేయాలని మెలానియా కోరడంతో వేలంలో వస్తువులకు తక్కువ ధర పలికినట్టు తెలిసింది. బిడ్ కనీస ధర 1800 సొలానా టోకెన్లు ఉండాలని మేలానియా కోరుకున్నారు. కానీ.. ఆక్షన్ ప్రకటన వెలువడిన తరువాత సొలానా టోకెన్ల విలువ ఒడిదుడుకులకు లోనైంది. గతంలో ఒక సొలానా టోకెన్ ధర 170 డాలర్లు కాగా.. బుధవారం(జనవరి 26) వేలం ముగిసే సమయానికి అది 95 డాలర్లకు చేరుకుంది. ఫలితంగా..మెలానియా వస్తువులకు ఆశించిన ధర రాలేదు. ముందు పేర్కొన్న దాని కంటే 85 వేల డాలర్ల తక్కువ ధరకు ఆ మూడూ అమ్ముడుపోయాయి. అంతేకాకుండా.. కేవలం ఐదు బిడ్లు మాత్రమే దాఖలైనట్టు తెలిసింది. దీంతో.. మెలానియాకు నిరాశ తప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు మెలానియాను ఆన్‌లైన్‌లో ట్రోల్ చేశారు కూడా! కాగా.. వేలంలో వచ్చిన మొత్తంలో కొంత భాగం విరాళంగా ఇస్తానని మెలానియా గతంలోనే ప్రకటించారు.

Updated Date - 2022-01-31T23:25:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising