ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait వెళ్లేవారికి గుడ్‌న్యూస్

ABN, First Publish Date - 2022-02-15T15:12:14+05:30

తమ దేశానికి వచ్చే విదేశీ ప్రయాణికులకు కువైత్ గుడ్‌న్యూస్ చెప్పింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు పలు కరోనా ఆంక్షలను తొలగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: తమ దేశానికి వచ్చే విదేశీ ప్రయాణికులకు కువైత్ గుడ్‌న్యూస్ చెప్పింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు పలు కరోనా ఆంక్షలను తొలగించింది. దీనిలో భాగంగా జర్నీకి ముందు, అరైవల్ సమయంలో పీసీఆర్ టెస్టు అవసరం లేదని పేర్కొంది. ఫిబ్రవరి 20 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎం. తారిఖ్ అల్ ముజ్రం వెల్లడించారు. అయితే, 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో మాత్రం ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ క్వారంటైన్‌ను ముందే ముగించాలనుకుంటే పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపిస్తే సరిపోతుందని తారిఖ్ తెలిపారు. 


ఇక వ్యాక్సినేషన్ పూర్తికాని ప్రయాణికులకు మాత్రం ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. కాగా, కువైత్ ప్రభుత్వం ఆమోదించిన టీకాలను మూడు డోసులు తీసుకున్నవారు లేదా కనీసం తొమ్మిది నెలల ముందు రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారిని వ్యాక్సినేషన్ పూర్తైనట్లు గుర్తించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రెండు డోసులు తీసుకుని తొమ్మిది నెలలు నిండని వారిని, కువైత్‌లో ఆమోదం పొందిన వ్యాక్సిన్‌లను రెండు డోలను తీసుకోని వారు టీకాలు వేయని వ్యక్తులుగా గుర్తించింది. 


Updated Date - 2022-02-15T15:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising