ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New zealand: అంతర్జాతీయ పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పిన న్యూజిల్యాండ్..!

ABN, First Publish Date - 2022-08-02T04:53:08+05:30

అంతర్జాతీయ పర్యాటకులకు న్యూజీల్యాండ్(New zealand) తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా ఆంక్షలన్నిటినీ(Corona restrictions) పూర్తిస్థాయిలో ఎత్తేస్తున్నట్టు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అంతర్జాతీయ పర్యాటకులకు న్యూజిల్యాండ్(New zealand) తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా ఆంక్షలన్నిటినీ(Corona restrictions) పూర్తిస్థాయిలో ఎత్తేస్తున్నట్టు తెలిపింది. సోమవారం నుంచి వివిధ దేశాల పర్యటకులు ఎటువంటి అడ్డంకులు లేకుండా న్యూజిల్యాండ్‌కు రావచ్చని చెప్పింది. కరోనా సంక్షోభం నెమ్మదిస్తున్న సమయంలో న్యూజిల్యాండ్ ఈ ఫిబ్రవరిలో తొలిసారిగా ఆంక్షలను తొలగించింది. కొన్ని పరిమితులకు లోబడి విదేశీయులను దేశంలోకి ఆహ్వానించింది. విడతల వారీగా ఆంక్షలు ఎత్తేయాలని అప్పట్లో నిర్ణయించింది. ఈ ప్రక్రియ తాజాగా ముగియడంతో న్యూజిల్యాండ్‌‌లో పర్యటించాలనుకునేవారికి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టైంది. 


న్యూజిల్యాండ్ విద్యార్థి వీసా ఉన్నవారందరికి తమ దేశంలోకి ప్రవేశించవచ్చని తాజాగా పేర్కొంది. అంతేకాకుండా.. క్రూయిజ్ నావలను కూడా తమ పోర్టుల్లో నిలిపేందుకు అనుమతిచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పూర్తిస్థాయిలో కరోనా టీకా తీసుకున్న వారినే దేశంలోకి అనుమతిస్తారు. అంతేకాకుండా.. పర్యాటకులు దేశంలోకి కాలుపెట్టాక తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే..తప్పనిసరి క్వారంటైన్ నిబంధన నుంచి పర్యాటకులకు మినహాయింపు నిచ్చింది. 

Updated Date - 2022-08-02T04:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising