ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE లో కొత్త సైబర్‌క్రైం చట్టం.. ఇకపై అలా చేస్తే రూ.10కోట్ల వరకు జరిమానా!

ABN, First Publish Date - 2022-01-06T15:24:53+05:30

యూఏఈలో కొత్త సైబర్‌క్రైం చట్టం అమలులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: యూఏఈలో కొత్త సైబర్‌క్రైం చట్టం అమలులోకి వచ్చింది. 2022 జనవరి 2 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం ప్రమాద బాధితుల ఫొటోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం రెండు కూడా నేరంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే ఇతరుల అనుమతి లేకుండా పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్రాంతాల్లో ఫొటోలు తీసినా, వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈ రెండు నేరాలకు గాను కనీసం ఏడాది జైలుతో పాటు సుమారు 2.50లక్షల దిర్హమ్స్(రూ.5కోట్లు) వరకు జరీమానా ఉంటుంది. గరిష్టంగా 5లక్షల దిర్హమ్స్(రూ.10కోట్లు) వరకు ఫైన్ విధిస్తారు. పౌరులు, నివాసితుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుందని ఈ సందర్భంగా ఓ న్యాయవాది పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా అబుధాబిలోని క్రిమినల్ లాయర్ అలీ అబేద్ మాట్లాడుతూ.. ఈ డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ నేరాలను తగ్గించడంలో సైబర్ క్రైమ్ చట్టానికి సవరణ అనేది యూఏఈ ప్రజలకు మరింత రక్షణ కల్పిస్తుందని అన్నారు. "సోషల్ మీడియా ద్వారా ఇతరుల గోప్యతపై దాడి చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ కఠినమైన శిక్షలతో ప్రజల చిత్రాలను తీయడం, వారి సమ్మతి లేకుండా ఆన్‌లైన్‌లో వాటిని వైరల్ చేయడం వంటి వాటితో ప్రజలు జాగ్రత్త పడతారని నేను నమ్ముతున్నాను" అని అలీ అబేద్ తెలిపారు.  

Updated Date - 2022-01-06T15:24:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising